అత్యధిక వ్యూస్ సాధించిన సినిమా జాబితాలో రంగస్థలం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తాజా చిత్రం రంగస్థలం రికార్డుల వేట మొదలెట్టింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ నిన్న రిలీజ్ అయి యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. అసలు సోషల్ మీడియాలోనే వైరల్ అయింది. ఈ టీజర్ 25.5 గంటల్లో కోటి డిజిటల్ వ్యూస్‌ని రాబట్టి ఔరా అనిపించింది. తెలుగు సినీ చరిత్రలో “బాహుబలి కంక్లూజన్” ట్రైలర్ కేవలం 23 గంటల్లో కోటి వ్యూస్‌ని సొంతం చేసుకుని మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్ “నా పేరు సూర్య” ఉండేది.

వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫస్ట్ ఇంపాక్ట్ రిలీజైన 29 గంటలలో కోటి డిజిటల్ వ్యూస్‌ని సాధించి రెండో ప్లేస్ ని అందుకుంది. “బాహుబలి” తర్వాత ఆ ఘనత సాధించిన సినిమాగా రికార్డ్‌ని క్రియేట్ చేసింది. అయితే బన్నీ రికార్డును రామ్ చరణ్ బద్దలు కొట్టారు. 25.5 గంటల్లో కోటి డిజిటల్ వ్యూస్‌ రాబట్టి రెండో స్థానాన్ని కైవశం చేసుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో సమంత, జగపతిబాబు, ఆది తదితరులు నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంపై టీజర్ అంచనాలను పెంచింది. పాతికేళ్ల నాటి కథతో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 30 న విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus