రంగ‌స్థ‌లం థాంక్స్ మీట్‌

రామ్‌చ‌ర‌ణ్‌, స‌మంత జంట‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సివిఎం(మోహ‌న్‌) నిర్మించిన చిత్రం `రంగ‌స్థ‌లం`. మార్చి 30న సినిమా విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించిన సంద‌ర్భంగా చిత్ర యూనిట్ థాంక్స్ మీట్‌ను సోమ‌వారం హైద‌రాబాద్‌లో నిర్వ‌హించింది. ఈ సంద‌ర్బంగా…

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ – “సుకుమార్‌కి థాంక్స్‌. మ‌మ్మ‌ల్ని న‌మ్మి త‌ను ఓ క్రేజీ మిష‌న్‌ను మా భుజాల‌పై పెట్టాడు. త‌న మిష‌న్‌ను ఇంత పెద్ద స‌క్సెస్ చేసినందుకు థాంక్స్‌. సాధారణంగా మ‌మ్మ‌ల్ని చాలా మంది `మీరు ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకునే సినిమాలు ఒప్పుకుంటారా?` అని అడుగుతుంటారు. లేదండి.. నేనెప్పుడూ ఫ్యాన్స్‌ను దృష్టిలోపెట్టుకుని సినిమాలు ఒప్పుకోలేదు. సుకుమార్‌గారు చెప్పిన క‌థ ముందు నాకు న‌చ్చాలి. అలా న‌చ్చితే అంద‌రికీ న‌చ్చ‌తుంది. అంద‌రూ గ‌ర్వ‌ప‌డే సినిమా చేయాల‌నే క‌థ వింటాం. సినిమా స‌క్సెస్‌లో అసోసియేట్ అయిన ప్ర‌తి ఒక‌రికీ థాంక్స్‌. ఇలాంటి స‌క్సెస్ ఇండ‌స్ట్రీకి ఎంతో అవ‌స‌రం. స‌మ్మ‌ర్‌కి రాబోయే మ‌రో రెండు సినిమాలు కూడా పెద్ద స‌క్సెస్ కావాలి. డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ అంటే నాకు ఎంతోఇష్టం. ఎందుకంటే వారు ఈ సినిమా రంగంలో వ‌చ్చే ప్ర‌తి రూపాయిని మ‌ళ్లీ నెక్ట్స్ సినిమాపైనే పెడ‌తారు. వాళ్లంద‌రూ హ్యాపీగా ఉండాలి. స‌పోర్ట్ చేసినందుకు అంద‌రికీ థాంక్స్‌“ అన్నారు.

జ‌గ‌పతిబాబు మాట్లాడుతూ – “ఈ సినిమాకు డ‌బ్బింగ్ చెబుతున్న‌ప్పుడు చిట్టిబాబు క్యారెక్ట‌ర్‌ను చాలా ప్రేమించాను. ఓ మ‌గాడిగా మ‌రో మగాడు ముద్దొచ్చాడు. అలాగే ఈ ప్రెసిడెంట్‌ను చిట్టిబాబు చంపేయాల‌నేంత‌గా చిట్టిబాబు క్యారెక్ట‌ర్‌ను ప్రేమించాను. `ఈ నా కొడుకును ఎప్పుడు చంపుతాడు చిట్టిబాబు` అని నాకే అనిపించింది. ఇప్పుడు ఆడియెన్స్‌లో కూడా అదే ఫీలింగ్ క‌లుగుతుంది. నాకు లెజెండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఓ లీప్ అయితే.. ఈ రంగ‌స్థ‌లంతో మ‌రో లీప్ వ‌చ్చింది. ఇది సుకుమార్ ఇచ్చిన ఇంకో లైఫ్‌. నేను మాస్ చేయ‌గ‌ల‌ను. ఊర‌గా కూడా క‌న‌ప‌డ‌గ‌ల‌ను అని అంటే ఎవ‌రూ గ‌మ‌నించ‌లేదు. ఒక సుక్కునే గ‌మ‌నించాడు. ప్రేక్ష‌కులు కూడా చ‌క్క‌గా స్వీక‌రించారు. సుక్కు ద‌ర్శ‌క‌త్వంలో చేసేట‌ప్పుడు త‌న ముఖంలో గ్లో వ‌చ్చే వ‌ర‌కు నేను న‌టిస్తాను. లేకుంటే.. నాకే బాధ‌గా ఉంటుంది. సుక్కు ఈ సినిమా కోసం రెండు మూడు క్లోజ్‌ల కోసం న‌న్ను రాజ‌మండ్రికి పిలిపించారు. నేను షూటింగ్‌లు క్యాన్సిల్ చేసుకుని వెళితే .. కొంద‌రు అంత అవ‌స‌ర‌మాఅన్నారు.. సుక్కు ఒక్క క్లోజ్ పెట్టినా అందులో చాలా ఉంటుంద‌ని అన్నాను“ అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ – “మూడు రోజుల్లో ఎంత కలెక్ష‌న్స్ అయితే వ‌చ్చాయో.. నాలుగు రోజు సోమ‌వారం కూడా అంతే క‌లెక్ష‌న్స్ రావ‌డం సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్‌ అన‌డానికి పెద్ద నిద‌ర్శ‌నం. ఆర్య త‌ర్వాత సుక్కు సినిమా పూర్తిగా న‌చ్చిన సినిమా ఇది. సుక్కు కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. స్టార్ హీరో కొత్త‌గా ట్రై చేసిన‌ప్పుడు వ‌చ్చే ఫీలింగ్ వేరేలా ఉంటుంది. అది ధృవ సినిమాకు.. అలాగే ఈ సినిమాకు కూడా వ‌ర్కువ‌ట్ అయ్యింది. మంచి అప్రిసియేష‌నే కాదు.. మంచి క‌లెక్ష‌న్స్ వ‌స్తున్నాయి. నిర్మాత‌లు ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. సుకుమార్ ఒక సంవ‌త్స‌రం పెట్టిన క‌ష్టం. అంద‌రి ముఖాల్లోనూ క‌న‌ప‌డ‌తుంది. మ‌గ‌ధీర‌ను కూడా ఈ సినిమా క్రాస్ చేయ‌బోతుంది. టీం అంత‌టికీ కంగ్రాట్స్‌“ అన్నారు.

న‌వీన్ ఎర్నేని మాట్లాడుతూ – “రంగ‌స్థ‌లం వంటి సినిమా చేసే అవ‌కాశం ఇచ్చిన చ‌ర‌ణ్‌గారికి థాంక్స్‌. సాధార‌ణంగా ఓ సినిమాలో హీరోకు పెర్ఫామెన్స్ చేయ‌డానికి అర‌గంటో, గంటో ఆస్కారం ఉంటుంది. స్టార్టింగ్ షాట్‌నుండి ఎండింగ్ వ‌ర‌కు మూడు గంట‌ల పాటు చ‌ర‌ణ్‌గారికి పెర్ఫామెన్స్ సూప‌ర్బ్‌. నేనే కాదు.. ఇది అంద‌రూ చెబ‌తున్న మాటే. చ‌ర‌ణ్‌గారి కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అని అంద‌రూ న‌మ్ముతున్నాం. ఆల్ టైమ్ హిట్ ఇచ్చిన సుకుమార్‌గారికి థాంక్స్‌. సినిమా బ‌డ్జెట్ ఎక్కువ అవుతుంద‌ని.. ఇంకేదో అవుతుంద‌ని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ కావ‌డానికి ముందే సెఫ్టీ ప్రాజెక్ట్‌. సుకుమార్‌గారితో మా ట్రావెల్ ఎంతో కంఫ‌ర్ట్‌గా అనిపించింది. ఫ‌స్ట్ షెడ్యూల్ కాగానే మ‌రో సినిమా చేయ‌మ‌ని సుకుమార్‌గారితో కమిట్ అయ్యామంటే మా జ‌ర్నీ ఎంత బాగా సాగిందో అర్థం చేసుకోవాలి. ర‌త్న‌వేలుగారు గ్రేట్ జాబ్ చేశారు. సినిమా కోసం ఎంతోఇన్‌వాల్వ్ అయ్యారు. ఆర్ట్‌డైరెక్ట‌ర్ రామ‌కృష్ణ‌, మోనిక‌గారు, చంద్ర‌బోస్‌గారి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అన్ని సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యాయి. దేవిశ్రీతో మంచి రిలేష‌న్ ఉంది. మా మూడు సినిమాలకు ఆయ‌న మంచి మ్యూజిక్ ఇచ్చాను. జ‌గ‌ప‌తిబాబుగారు న‌ట‌న చూసి ఫోన్ చేసి ఆయ‌న కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫామెన్స్అని చెప్పాను. అన‌సూయ‌, ఆదిపినిశెట్టి, ప్ర‌కాశ్‌రాజ్‌గారు అంద‌రూ అద్భుతంగా న‌టించారు. సినిమా రిలీజ్ త‌ర్వాత మూడు రోజులు చాలా హ్యాపీగా అనిపించింది. నా జీవితంలో నా సంతోష‌ప‌డ్డ స‌మ‌యంగా భావిస్తున్నాను. డిస్ట్రిబ్యూటర్స్‌తో మాట్లాడుతుంటే వారు చెబుతున్న క‌లెక్ష‌న్స్ విని ఆనందంగా అనిపిస్తుది. బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 త‌ర్వాత ఇదే టాప్ గ్రాస‌ర్ అవుతుంది. ఖైదీని కూడా చ‌ర‌ణ్‌గారు దాటేస్తారు. చాలా ఎగ్జ‌యిటింగ్ అనిపిస్తుంది. ఇంత బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన చ‌ర‌ణ్‌, సుకుమార్‌గారికి థాంక్స్‌“ అన్నారు.

సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు మాట్లాడుతూ – “సినిమా హిట్ మామూలుగా ఉంటుంది. కానీ సూప‌ర్ డూప‌ర్ హిట్ అనేది చాలా అరుదుగా వ‌స్తుంటుంది. 20 ఏళ్ల క్రితం సేతు అనే సినిమాకు అప్రిసియేషన్స్‌తో పాటు క‌లెక్ష‌న్స్ కూడా వ‌చ్చాయి. ఇప్పుడు రంగ‌స్థలం కూడా అలాంటి అనుభూతే క‌లుగుతుంది. సుకుమార్‌, నిర్మాత‌ల‌కు థాంక్స్‌. చ‌ర‌ణ్ వ‌న్ టేక్. నేచుర‌ల్ పెర్ఫామ‌ర్‌“ అన్నారు.

సుకుమార్ మాట్లాడుతూ – “ ఇంత మంచి రెస్పాన్స్ రావ‌డం కొత్త‌గా ఉంది. నాకు,చ‌ర‌ణ్‌కు కామ‌న్ ఫ్రెండ్ రంగ. అత‌ని ద్వారా నాన్న‌కు ప్రేమ‌తో స‌మ‌యంలో చ‌ర‌ణ్‌ని క‌లిశాను. త‌ను నా మైండ్‌లోఉండిపోయాడ‌మో.. కాబ‌ట్టి ఈ సినిమాకు రంగ‌స్థ‌లం అనే టైటిల్‌ను పెట్టుకున్నాను. ఈ సంద‌ర్భంగా మామిత్ర‌డు రంగ‌కు థాంక్స్‌. `నాన్న‌కు ప్రేమ‌తో త‌ర్వాత జ‌గ‌ప‌తిబాబుగారు సెక్సీగా ఉన్నారు` అని చాలా మంది అన్నారు. త‌ర్వాత రంగ‌స్థ‌లం సినిమా చూసిన త‌ర్వాత కూడా అలాగే అంటున్నారు. ఆయ‌న ఏ రూపంలో ఉన్నా బంగార‌మే. ఆయ‌న‌తోనే ప్రేమ‌లోప‌డిపోయాను. ఆయ‌న‌తో ప్ర‌తి సినిమా చేయాల‌నుకుంటున్నాను. చంద్ర‌బోస్‌గారి సాహిత్యం.. ఎంత స‌క్క‌గున్నావే అనే పాట‌ను అంద‌రూ ఎంతో పొగుడుతున్నారు. ఆ పాట‌ను కేవ‌లం 20 నిమిషాల్లో ఇచ్చారు. రామ‌కృష్ణ ఆర్ట్ డైరెక్ష‌న్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. న‌వీన్ నూలి ఎడిటింగ్‌.. గురించి చెప్పాలంటే.. త‌ను ఇండ‌స్ట్రీ ఉన్నంత కాలం ఉండిపోయే ఎడిటర్‌. త‌ను అన్నీ డిపార్ట్ మెంట్స్‌పై అవ‌గాహ‌న ఉంది. ర‌త్న‌వేలుగారు సినిమాటోగ్ర‌ఫీతో అందంగా పెయింటింగ్ వేస్తారు. ఏ క్యారెక్ట‌ర్‌ను ఎలా చూపించాల‌ని.. ప్ర‌తి ఫ్రేమ్‌ను అందంగా రాసే రైట‌ర్ అని చెప్పొచ్చు. త‌ను ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫ‌ర్ అని చెప్ప‌గ‌ల‌ను. స్పాంటేనియ‌స్‌గా వ‌ర్క్ చేసి అద్బుత‌మైన అవుట్‌పుట్ ఇచ్చే టెక్నీషియ‌న్‌. దేవి నా ఆత్మ‌. త‌ను లేక‌పోతే నేను లేను. నా ఆత్మ‌కు రూప‌ముంటే అది దేవినే. మా మ‌ధ్య వ్య‌క్తిగ‌త సానిహిత్యం కూడా ఉంది. రంగ‌మ్మ‌త్తను సెట్స్‌లో ఎంత బాధ పెట్టినా.. త‌ను మాత్రం పెర్ఫామెన్స్‌తో మెప్పించింది. ఈ పాత్ర‌ను ఎంచుకోవ‌డంలో నేను చాలా క‌న్‌ఫ్యూజ‌న్ అయ్యాను. చివ‌ర‌కు అన‌సూయ‌ను ఎంచుకున్నాను. అన‌సూయ త‌న పాత్ర‌కు ఎంతో న్యాయం చేసింది. హీరోయిన్‌కు మ్యారేజ్ అయితే సినిమాలను ఆడియెన్స్ చూడ‌ర‌ని అంద‌రూ అంటుంటారు. కానీ స‌మంత విష‌యంలో అలా జ‌ర‌గ‌లేదు. రూల్స్‌ను బ్రేక్ చేసిన సినిమా ఇది. ఆది పినిశెట్టి ఆమేజింగ్ ఆర్టిస్ట్‌. కుమార్ బాబు క్యారెక్ట‌ర్‌లో అద్భుతంగా చేశాడు. చిట్టిబాబు కంటే కుమార్‌బాబు క్యారెక్ట‌ర్‌నే ఇష్ట‌ప‌డ్డాను. మైత్రీ మూవీస్ బ్యాన‌ర్‌లో ఖ‌ర్చు గురించి ఎక్క‌డా డిస్క‌ష‌న్ రాలేదు. సినిమా చేసే క్ర‌మంలోనేను ఎక్క‌డా త‌ప్పులు చేస్తున్నానో అర్థ‌మైంది. నిర్మాత‌లు ముగ్గురు బోళా శంక‌రులు. వారికి మూడు బ్లాక్‌బ‌స్ట‌ర్ రావ‌డానికి కార‌ణం వారి మంచి మ‌న‌సు. సినిమాపై వారికున్న ప్రేమ‌. చ‌ర‌ణ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. చిట్టిబాబు క్యారెక్ట‌ర్లో నేను ఎవ‌రినీ ఊహించ‌లేదు. అలాంటి క్యారెక్ట‌ర్‌ను ఒప్పుకోవ‌డం దారుణం.. సాహ‌సం. త‌ను చేయ‌లేక‌పోతే.. నేను ఏమీ చేయ‌లేను. విన‌గానే కొత్త‌గా ఉంటుంద‌ని న‌మ్మి క్యారెక్ట‌ర్‌ను ఓన్ చేసుకుని చేశాడు. డీ గ్లామ‌రైజ్డ్‌క్యారెక్ట‌ర్‌ను ఇష్ట‌ప‌డి చేశాడు. ఈ క్రెడిట్ అంతా త‌న‌కే ద‌క్కుతుంది“ అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus