లారా పాత్రలో తనీష్ నటన ఒక రిఫరెన్స్ లా మిగులుతుంది – సిరివెన్నెల సీతారామశాస్త్రి

న‌ల్ల‌స్వామి స‌మ‌ర్ప‌ణ‌లో యు అండ్ ఐ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై త‌నీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంకటేశ్వ‌ర‌రావు, ష‌ఫీ, పోసాని కృష్ణ‌ముర‌ళి ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం `రంగు`. కార్తికేయ‌.వి ద‌ర్శ‌క‌త్వంలో ఎ.ప‌ద్మ‌నాభ‌రెడ్డి, న‌ల్ల అయ్య‌న్న నాయుడు నిర్మాత‌లు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. బిగ్ బాస్ సీజన్ 2 పాల్గొన్న సభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డాన్సర్స్ తో కలసి ఆడిపాడి హీరో, హీరోయిన్లు అతిథులను ఆనందింప చేసారు. ఈవెంట్ లో ‘రంగు’ సినిమా పాటలను
అతిథులతో లాంఛ్ చేయించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా అతిథులు, చిత్ర బృదం మాట్లాడుతూ…

రాజ్ కందుకూరి మాట్లాడుతూ : ‘‘ టైటిల్ నాకు బాగా నచ్చింది. సినిమా పాటలు, ట్రైలర్స్ చూస్తుంటే చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. తనీష్ నటన ఎంటో మనం చిన్నతనం నుండి చూస్తున్నాం. అతనికి ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు.

పరుచూరి వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ : ‘‘ఈ సినిమా నేను చూసాను, తనీష్ కనపడలేదు లారా నే కనపడ్డాడు. మా అబ్బాయి నటన కూడా బాగుంది. అలాగే మ్యూజిక్ దర్శకుడు యోగీశ్వర శర్మ కూడా చక్కని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ సినిమా. వందల సినిమాలకు కథ, మాటలు అందించాం. కార్తికేయ అందించిన కథ మాకు బాగా నచ్చింది. లారా కుటుంబ సభ్యుల ఈ సినిమా చూసి కన్నీళ్ళు పెట్టుకున్నారు. ప్రేక్షకులకు కూడా అదే భావన కలుగుతుందని నా నమ్మకం . లారా అనే వ్యక్తులు విజయవాడలోనే కాదు, ప్రతి ఊరిలోనూ కనపడతారు, అలాంటి యూనివర్సల్ సబ్జెక్ట్ ను తీసుకున్నాడు దర్శకుడు. తనీష్ నటన అద్భుతంగా ఉంది. మా చేతులు మీదుగా పెద్ద స్టార్ ని చేయాలని ఉంది. రంగు అనే టైటిల్ ఎందుకు పెట్టారంటే మనుషులలో రకరకాల రంగులు ఉంటాయి. అవి అవసరాన్ని బట్టి బయటపడతాయి. ఈ సినిమా విశేషంగా ప్రజలను ఆకట్టుకుంటుంది అని నా నమ్మకం’’ అన్నారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ : ‘‘ఈ ఈవెంట్ కి రావడానికి రావడానికి కారణం నిర్మాత పద్మనాభ రెడ్డి గారు. అనేక మందికి చేయూత నిచ్చి, తాను ఎదుగుతూ, పదిమందికి ఉపయోగపడుతున్నారు. ఇలాంటి వ్యక్తులు ఇండస్ట్రీ లో తక్కువుగా ఉంటారు. చిన్న కథలకు ఆదరణ పెరుగుతుంది. కథ బాగుంటే సినిమాలు ప్రజాదరణ పొందుతున్నాయి. కథ లేని సినిమాలను ఎన్ని హాంగులున్నా ప్రేక్షకులు తిప్పి కొడుతున్నారు. రంగు చాలా ఆరోగ్య కరమైన సినిమా. గాయం లో ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జగాన్ని ’ అనే పాట రాసాను. అది నాకు చాలా తృప్తినిచ్చింది. చాలాకాలం తర్వాత ‘ఎక్కడ ఉంది ఈ చిక్కుముడి’ అంటూ రంగులో ఒక పాట రాయడం జరిగింది. అప్పటికీ ఇప్పటికీ సమాజంలో ఏ మార్పులేదు. ‘రంగు’ లో పాటలు బాగున్నాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది అంటున్నారు. మా అబ్బాయికి మంచి పేరు వచ్చినందుకు సంతోషంగా ఉంది. మా అబ్బాయిని పొగడటం నాకు ఇబ్బందిగా ఉంటుంది. పరుచూరి వెంకటేశ్వరరావు కు నాకు, పుత్రోత్సాహం కలిగించింది దర్శకుడు కార్తికేయ కు ఉన్న పట్టుదల ఈ సినిమా పట్ల ఆశావాహ దృక్పథం ఈ సినిమాను ఇంత వరకూ తెచ్చాయి. మేమే ఆయన దారిలోకి వెళ్లి పనిచేసాం. పరుచూరి బ్రదర్స్ కథతో ప్రయాణం చేసారు. ‘రంగు’ లో కనిపించే క్రోథం ఎక్కడికి తీసుకెళ్తుంది ఎక్కడ ముంచుతుంది అనేది కథ, లారా పాత్రలో తనీష్ నటన ఒక రిఫరెన్స్ లా మిగలుతుంది. ఈ సినిమా తో స్టార్స్ అయినా నేల మీద నక్షత్రాలుగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

నటుడు పరుచూరి రవి మాట్లాడుతూ : ‘‘యువత ఆలోచనలకు దగ్గరగా ఉండే సినిమా ఇది. రెగ్యులర్ పోలీస్ పాత్రలకంటే భిన్నంగా నా పాత్ర ఉంటుంది. ఈ సినిమా తనీష్ కి మంచి బ్రేక్ నిస్తుంది. అలాగే ‘రంగు ’ పనిచేసిన వారందరికీ మంచి గుర్తింపు నిస్తుందని నమ్ముతున్నాను. మౌనపోరాటం, సర్పయాగం, కర్తవ్యం సినిమాలలాగా ఈ సినిమా నిలుస్తుంది. ఈ సినిమాలో యువతకు సిరివెన్నెల గారు ఒక ప్రశ్నవేసాడు ‘
ఎక్కడ ఉంది చక్కుముడి’అనే పాట వారి ఆలోచనలను కదిలిస్తుంది. ఇది సాధారణ యువకుల జీవితం ని ఆవిష్కరించే కథ ’ అన్నారు.

నటుడు షఫి మాట్లాడుతూ : ‘‘పదేళ్ల క్రితం సిరివెన్నెల గారు అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్ర మందామా అనే పాట తర్వాత ఇప్పుడ ఎక్కడ ఉంది చిక్కుముడి అని సమాజాన్ని ప్రశ్నించేటట్లు , ఒడిదుకులు గురించి అొంత అద్భుతంగా రంగు కథ కోసం ఆయన కలం కదిలింది. అలాగే దర్శకుడు కార్తికేయ ఈ కథ కోసం పడిన తపన అంతా ఇంతా కాదు. విజయవాడలో కొంతమందిని ఆర్టిస్ట్ లుగా తయారు చేసుకున్నాడు. యూనిట్ అందరికీ కథను ఇంజెక్ట్ చేసాడు దర్శకుడు కార్తికేయ. నిర్మాతలు ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను. తనీష్ కి ఈ సినిమా జీవితంలో ఎన్నో రంగులు నింపాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

హీరో త‌నీశ్ మాట్లాడుతూ – “నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 20 ఏళ్లు అయ్యింది. నా తొలి సినిమా హిట్ అయిన రోజు నాకు చాలా ఆనంద‌మేసింది. చాలా ఏళ్ల త‌ర్వాత ఇంత ఆనందంగా ఉంది. ఈ సినిమాలో సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు వంటి దిగ్గ‌జాల‌తో క‌లిసి ప‌నిచేశాను. చాలా రోజుల త‌ర్వాత మా అమ్మ నాకోసం ఈ ఫంక్ష‌న్‌కు వ‌చ్చారు. నా ఎక్స్‌డెంటెడ్ ఫ్యామిలీతో జ‌రుపుకుంటున్న తొలి ఫంక్ష‌న్. ఈ మూడు కార‌ణాల‌తో నేను చాలా ఆనందంగా ఉన్నాను. కార్తికేయ‌గారు సినిమాను నాతో చేసినందుకు ఆయ‌న‌కు థాంక్స్‌. నా నిర్మాతలు ప‌ద్మ‌నాభ‌రెడ్డిగారికి , నాయుడుగారు, వాసు గారికి థాంక్స్. ప‌ద్మ‌నాభ‌రెడ్డిగారు ఇండ‌స్ట్రీలో టాప్ ప్రొడ్యూస‌ర్‌గా ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను. సురేంద‌ర్ రెడ్డిగారు అద్భుత‌మైన విజువ‌ల్స్ అందించారు. యోగి అన్న అందించిన రీరికార్డింగ్ మా పెర్ఫామెన్స్‌ల‌ను నెక్స్‌ట్ లెవ‌ల్‌కు తీసుకెళ్లింది. ర‌వి అన్న‌కు.. థాంక్స్‌. చాలా మంచి క్యారెక్ట‌ర్‌లో మెప్పిస్తాడు. ష‌ఫీగారు మ‌రో అద్భుత‌మైన రోల్‌లో మెప్పిస్తాడు. ఆయ‌న‌తో వ‌ర్క్‌చేయ‌డాన్ని గొప్ప‌గా భావిస్తాను. థియేట‌ర్ బ్యాగ్రౌండ్ నుండి వ‌చ్చిన ప్రియా చ‌క్క‌గా న‌టించింది. ఇందులో హీరోలు, విల‌న్స్ లేరు.. అన్ని పాత్ర‌లే. ప్ర‌తి పాత్ర ఎలా ఉండాలి.. ఎలా ఉండ‌కూడ‌ద‌నే విష‌యాల‌ను నేర్పిస్తుంది. ఈ నెల 23న మా సినిమా పోస్ట‌ర్ ప‌డుతుంది. సినిమా విడుద‌ల‌వుతుంది“ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు కార్తికేయ మాట్లాడుతూ – “24 క్రాఫ్ట్స్‌తో సినిమా చేయ‌డం అంటే కాస్త బ‌రువుతో కూడుకున్న విష‌యం. ద‌ర్శ‌కుడిగా తొలి చిత్రం కాబ‌ట్టి డిఫ‌రెంట్ స్టోరీతో సినిమా చేయాల‌నుకున్నాను. క‌థ‌కు క్యారెక్ట‌ర్స్‌కు అవ‌కాశం ఉండి.. సోసైటీకి ఏదైనా మంచి మెసేజ్ ఇచ్చేలా ఉండే సినిమా చేయాల‌నుకుంటున్న త‌రుణం. అప్పుడు ఓ ఫ్రెండ్ ద్వారా లారా గురించి విన్నాను. ఆయ‌న స్నేహితుల‌ను క‌లిసి క‌థ‌ను త‌యారు చేసుకున్నాను. దాన్ని చ‌క్క‌గా ప్రెజెంట్ చేసేదెవ‌రు? అని ఆలోచించి పరుచూరి బ్ర‌ద‌ర్స్‌ను క‌లిశాను. వాళ్లు దీన్ని క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌లోకి మార్చి అద్భుతంగా మ‌లిచారు. 350పైగా సినిమాలు చేసిన వ్య‌క్తుల అనుభవం ఎంటో నాకు తెలిసింది. యోగీశ్వ‌ర శ‌ర్మ‌గారు సంగీతం కీ రోల్ పోషించింది. పాట‌ల‌తో పాటు.. బ్యాగ్రౌండ్ స్కోర్‌పై గ్రిప్ ఉన్న వ్య‌క్తి కావాల‌నుకున్న త‌రుణంలో శ్రీకారం చుడుతున్న‌ట్లు.. పాట విన్నాను. ఆ సాంగ్ విని.. యోగీశ్వ‌ర శ‌ర్మ‌గారిని క‌లిశాను. ఆయ‌న నాకెంటే ఎక్కువ‌గా ఓన్ చేసుకుని బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అద్భుతంగా ఇచ్చారు. గురువుగారు సీతారామ‌శాస్త్రిగారు.. సాయికిర‌ణ్‌గారు అద్భుత‌మైన సాహిత్యం ఇచ్చారు. సినిమాటోగ్రాఫ‌ర్ సురేంద‌ర్ రెడ్డిగారు ఓ టీచ‌ర్‌లా మ‌మ్మ‌ల్ని ముందుకు న‌డిపించారు. ఆయ‌నొక పిల్ల‌ర్‌లా నిల‌బ‌డి సినిమా బాగా రావ‌డానికి తోడ్ప‌డ్డారు. ష‌ఫీగారు త‌న న‌ట‌న‌తో సినిమాను నిల‌బెడ‌తారు. మ‌ల్లిడి ర‌వి, మితిలేష్‌.. అంద‌రూ ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. ర‌వి అన్న‌య్య అద్భుత‌మైన పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. ఆయ‌న పోషించిన క్యారెక్ట‌ర్ గురించి ప‌దేళ్లు చెప్పుకునేంత గొప్ప‌గా ఉంటుంది. నిర్మాత ప‌ద్మ‌నాభ‌రెడ్డిగారు ఎంత చెప్పినా త‌క్కువే. కొత్త డైరెక్ట‌ర్‌ను న‌మ్మి నాకొక గురువులా, తండ్రిలా, స్నేహితుడిలా, అన్న‌య్య‌లా నాకు స‌పోర్ట్ అందించారు. టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌గా పేరు తెచ్చుకుంటారు. తనీశ్ .. ఓ కంప్లీట్ హ్యుమ‌న్ బీయింగ్‌. ఈ క్యారెక్ట‌ర్‌ను.. త‌నీశ్‌ను ఓ రెఫ‌రెన్స్‌లా తీసుకునేంత గొప్ప‌గా న‌టించారు. లారా అనే క్యారెక్ట‌ర్‌లో ఒదిగిపోయారు. ఇన్‌టెన్స్‌తో న‌టించారు. స‌పోర్ట్ చేసిన అందరికీ థాంక్స్‌“ అన్నారు.

నిర్మాత ప‌ద్మ‌నాభ‌రెడ్డి మాట్లాడుతూ – “నేను సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌స్తాన‌ని అన‌గానే వీడికేమైంది? సినిమా ఇండ‌స్ట్రీలోకి వెళ‌తానంటున్నాడు
అని అనుకున్నారు. కానీ మ‌నిషికి దేవుడు ఓ బ్రెయిన్‌ని ఇచ్చాడు. కేవ‌ల పుట్టి.. పెరిగి.. పెళ్లి చేసుకుని, పిల్ల‌ల్ని క‌ని, పెద్ద చేసి చ‌నిపోవ‌డానికే మ‌నిషి ఆ బ్రెయిన్‌ని వాడ‌కూడ‌దు. ఏదైనా కొత్త‌గా చేసి చూపించాలి. అలా చేసిన‌ప్పుడే అంద‌రూ మ‌న‌ల్ని గుర్తు పెట్టుకుంటారు. ఓ కొత్త‌ బ్యాన‌ర్‌ను పెట్టుకుని కొత్త వారితో సినిమాలు చేయాల‌నుకుంటున్నాం. మా సినిమా వ‌ల్ల ఎవ‌రికీ న‌ష్టం రాదు.. రానివ్వ‌ను. ఒక సినిమా పోతే డిస్ట్రి బ్యూటర్స్ కి ఐదు సినిమాలు ఇస్తా. నేను అనుకునే స్థానంలో తప్పకుండా నిలబడతాను. నేను చెప్పిన స్థాయిలో కనపడకుండా చనిపోతే
ఒక కుక్క చనిపోయిందనుకోండి. నేను చాలా సినిమాలు తీస్తున్నాను. త‌క్కువ ఖ‌ర్చులో సినిమా ఎలా తీయాలో నేను నేర్చుకున్నాను. అలా అద్భుత‌మైన సినిమాలు తీద్దామ‌ని నా నిర్మాత‌ల‌కు కూడా ఇదే వేదిక‌గా చెబుతున్నాను. రేపు నా బ్యాన‌ర్ నుండి ఓ సినిమా రిలీజ్ అవుతుందంటే సినిమాకు క‌చ్చితంగా ఓ విలువ ఉంటుంద‌ని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. రంగు సినిమా చాలా బావుంటుంది. అద్భుత‌మైన సినిమా తీశామ‌ని న‌మ్మ‌కం ఉంది. ప్రేక్ష‌కులు మమ్మ‌ల్ని ఆశీర్వ‌దిస్తే మ‌రిన్ని మంచి సినిమాలు చేస్తాను“ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, హీరోయిన్ ప్రియా సింగ్‌, మ‌ల్కాపురం శివ‌కుమార్‌, ర‌వి, రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, యోగీశ్వ‌ర శ‌ర్మ‌, సామ్రాట్‌, రాజ్‌కందుకూరి త‌దిత‌రులు పాల్గొన్నారు .

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus