Ranveer,Deepika: రూ.119 కోట్లతో కొత్తిల్లు.. షాకిచ్చిన బాలీవుడ్ కపుల్!

బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకోన్ లు తాజాగా ఓ ఫ్లాట్ కొన్నారు. దాని ధర రూ.119 కోట్లు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న బాంద్రాలో సెలబ్రిటీలు ఎక్కువగా నివసిస్తుంటారు. ఇప్పుడు అదే ఏరియాలో రణవీర్ ఇల్లు కొన్నాడు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు నివసించే విల్లాల మధ్య రణవీర్ కొత్త ఫ్లాట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ అపార్ట్మెంట్ పేరు సాగర్ రేశం. ఒక సింగిల్ ఫ్లాట్ కి ఇంత రేటు పలకడం ఇదే మొదటిసారి అని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అపార్ట్మెంట్ కి సంబంధించిన చాలా విశేషాలు ఉన్నాయి. పేరుకి అపార్ట్మెంట్ అయినప్పటికీ.. రణవీర్, దీపికాలు ఉండబోయే ఫ్లాట్ బనాలుగు ఫ్లోర్స్ లో విస్తరించి ఉంటుంది. డబుల్ డ్యూప్లెక్స్ తరహాలో దీన్ని నిర్మించారు. సింపుల్ గా చెప్పాలంటే క్వాడ్రప్లెక్స్ అంటారు. 11 వేల 266 చదరపు అడుగులతో పాటు ప్రత్యేకంగా 1300 చదరపు అడుగుల్లో టెర్రస్ కూడా ఉంటుంది.

ఇందులో ఒక్క చదరపు అడుగు సుమారు లక్షపైనే ఉంటుందట. స్టాంప్ డ్యూటీ కోసమే రూ.7 కోట్ల 13 లక్షలు కట్టాల్సి రావడం దీని ప్రత్యేకత. ఇక వీరు కొన్న ఫ్లాట్ కి గాను మొత్తం 19 కార్లు వాహనాలు పార్కింగ్ చేసుకునే సదుపాయం ఇచ్చారు. అయితే రూ. 119 కోట్లతో అపార్ట్మెంట్ కొనడం మామూలు విషయం కాదు. ఈ లెక్కన ఈ స్టార్ కపుల్ ఏ రేంజ్ లో సంపాదిస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక వారి సినిమాల విషయానికొస్తే.. రణవీర్ ‘సర్కస్’. ‘రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’ సినిమాల్లో నటిస్తున్నారు. మార్పక్క దీపికా పదుకోన్ ‘ప్రాజెక్ట్ K’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో దీపికా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus