Ranveer Singh: స్టార్ హీరోకి తప్పని లైంగిక వేధింపులు!

క్యాస్టింగ్ కౌచ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేసింది. ఎంతోమంది నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగానే వెల్లడించారు. సౌత్ నుంచి నార్త్ వరకు పలువురు హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ కు గురైన విషయాల గురించి వెల్లడించారు. కొన్ని విషయాలు సంచలనమయ్యాయి . ఈ క్యాస్టింగ్ కౌచ్ లో చాలా మంది దర్శకులు, నిర్మాతలు, హీరోల బాగోతాలు బయటపడ్డాయి. కొన్నేళ్లపాటు ఈ అంశం ఇండస్ట్రీలో రగులుతూనే ఉంది.

ఇప్పటివరకు ఎక్కువగా లేడీ ఆర్టిస్ట్స్ మాత్రమే క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. అయితే పురుషులు కూడా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురవుతున్నారంటూ రణవీర్ సింగ్ వెల్లడించారు. ఈ క్రమంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను బయటకుచెప్పారు. తాజాగా ఈ హీరో మర్రకేచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో అవార్డు అందుకున్న రణవీర్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించారు.

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో ఓ నిర్మాత తనను పిలిపించి ‘నువ్ హార్డ్ వర్కరా..? లేక స్మార్ట్ వర్కరా..?’ అని అడిగారని.. ఆ సమయంలో ‘హార్డ్ వర్కర్’ అని బదులిచ్చానని రణవీర్ చెప్పారు. ఆ తరువాత అతడు.. ‘డార్లింగ్.. బీ స్మార్ట్.. బీ సెక్సీ’ అంటూ తనతో కాస్త అసభ్యంగా మాట్లాడాడని గుర్తుచేసుకున్నారు.

ఇండస్ట్రీకి వచ్చి తొలి మూడున్నరేళ్లలో తనకు అలాంటి అనుభవాలు చాలానే ఎదురయ్యాయని.. వాటిని తట్టుకొని నిలబడ్డాను కాబట్టే ఈ స్థాయికి చేరుకోగలిగానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ హీరో ‘సర్కస్’, ‘రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus