సినీ నేపథ్యం ఉన్నా రావు రమేష్ కి చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టడానికి చాలా సమయం పట్టింది. కానీ అతితక్కువ కాలంలోనే ఫామ్లోకి వచ్చారు. విభిన్నమైన పాత్రలకు తనదైన శైలిలో ప్రాణం పోస్తూ రావు గోపాల్ రావు కి తగ్గ కొడుకని నిరూపించుకున్నారు. సీమ సింహం తో మొదలెట్టిన ఆయన సినీప్రయాణంలో మైలు రాళ్లుగా నిలిచిన కొన్ని పాత్రలపై ఫోకస్..
గమ్యంఫ్రస్టేషన్ నక్సలైట్ గా గమ్యంలో రావు రమేష్ నటించి తొలిసారి గుర్తింపు సాధించారు. చిన్న పాత్ర అయినప్పటికీ ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రితో అభినందనలు అందుకున్నారు.
కొత్త బంగారు లోకంలెక్చరర్ గా కొత్త బంగారు లోకంలో రావు రమేష్ చెప్పిన డైలాగులు యువతకి బాగా కనెక్ట్ అయ్యాయి. “రొటీన్ గా కాకుండా.. సంథింగ్ డిఫరెంట్ గా చూడ్డానికి ట్రై చేయండి ..” అంటూ లెక్చర్ ప్రారంభించి యాక్టింగ్ లో వంద మార్కులు కొట్టేశారు. తన నటనతో సినిమా విజయానికి దోహదం చేశారు.
మగధీరమగధీర చిత్రంలో రావు రమేష్ ని మనం గుర్తుపట్టలేము. ఘోరా గా మేకప్ వేసుకోవడమే కాకుండా.. ఆ రీతిన నటించి పాత్రలో లీనమైపోయారు. ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేశారు.
విలేజిలో వినాయకుడురావు రమేష్ కి ఏదైనా పాత్ర ఇస్తే అందులో పరకాయ ప్రవేశం చేస్తారనడానికి మరో నిదర్శనం విలేజిలో వినాయకుడులో ఆయన చేసిన రిటైర్డ్ మేజర్ క్యారక్టర్. తన వయసుకన్నా ముప్పై ఏళ్ళ పెద్దవాడిగా ఆయన నటన మరచిపోలేము.
పిల్ల జమిందార్గెలుపు ఏముందిరా.. మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది… ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచం ఏంటో నీకు పరిచయం అవుతుంది… ఈ డైలాగులు రావు రమేష్ పిల్ల జమీందారు చిత్రంలో చెబుతుంటే సొంత మనిషి మనకి నీతులు చెబుతున్నట్లు ప్రతి అబ్బాయి, అమ్మాయి ఫీలయ్యారు. ఇలాంటి పాత్రలను ఎంచుకొని రావు రమేష్ యువతకు చాలా దగ్గరయ్యారు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుసినిమాల్లో హీరోలు చెప్పిన డైలాగులు పాపులర్ కావడం ఆనవాయితీ. కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో రావు రమేష్ చెప్పిన ప్రతి డైలాగ్ పేలింది. అచ్చమైన గోదావరి యాసలో “రే వాడిని ఎవరికైనా చూపించండ్రా” అంటుంటే థియేటర్స్ విజిల్స్ తో నిండిపోయింది.
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్విలన్ అంటే పిచ్చి పిచ్చిగా పనులు చేయడు .. కొంచెం డిఫరెంట్ గా ఉంటాడంతే. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రంలో రావు రమేష్ అలాగే నటించారు. విలక్షణ నటుడని మరో సారి నిరూపించుకున్నారు.
అత్తారింటికి దారేదికుటుంబ కథా చిత్రం అత్తారింటికి దారేదిలో లాయర్ గా, పవన్ కళ్యాణ్ కి మామయ్యగా అద్భుతంగా నటించి మెప్పించారు. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ వచ్చిన విధానం గురించి చెప్పే సీన్లో ఆయన నటన ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టించింది.
ముకుందగ్రామాల్లో సర్పంచ్ గా ఉన్న ఓ వ్యక్తి ఎలా ఉంటారు.. ఇతరులను ఎలా బయపెడుతారు.. కయ్యానికి ఎలా కాలు దువ్వుతారు.. అనేదాన్ని ముకుంద చిత్రంలో రావు రమేష్ కళ్లకు కట్టారు. హీరోకి వర్కింగ్ లు ఇచ్చే విధానం చాలా కొత్తగా ఉంటుంది.
సినిమా చూపిస్తా మామసినిమా చూపిస్తా మామ సినిమాలో సిన్సియర్ ఆఫీసర్ పాత్రని రావు రమేష్ చాలా సిన్సియర్ గా చేశారు. కూతురికి మంచి అబ్బాయిని ఇవ్వాలనే తాపత్రయం, జులాయిగా తిరిగే అబ్బాయి నుంచి అమ్మాయిని దూరం చేయాలనీ ఏదేదో పనులు చేస్తుంటే ప్రతి తండ్రి ఆ పాత్రకు కనెక్ట్ అయ్యారు.
బ్రహ్మోత్సవంసూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం బ్రహ్మోత్సవంలో గొప్పగా చెప్పుకునే అంశం ఏమిటంటే రావు రమేష్ నటన అంటే అతిశయోక్తికాదు. ఆనందంగా ఉన్న కుటుంబంలో కల్లోలం సృష్టించే పాత్రలో విరగదీసాడు. ఇంటర్వెల్ ముందు రావు రమేష్ చెప్పే డైలాగ్స్.. ఇంటికి వచ్చినా ప్రేక్షకుల చెవుల్లో మోగుతూనే ఉంటాయి. అలా తన మాడ్యులేషన్తో ఆకట్టుకున్నారు.
అ.. ఆఅ.. ఆ సినిమాలో రావు రమేష్ పల్లెటూరి వ్యక్తి పాత్రలో మరోసారి మెరిశారు. ఇందులోనూ పల్లం వెంకన్న మాత్రమే కనిపిస్తాడు. రావు రమేష్ కనిపించడు. అలా తనకే సొంతమైన డిక్షన్ తో మెస్మరైజ్ చేసాడు.