రామానాయుడు గారి జయంతిస్పెషల్ : రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!

టాలీవుడ్ స్థాయిని పెంచడంలో ‘బాహుబలి’ తో రాజమౌళి మాత్రమే కాదు.. మన మూవీ మొఘల్ మరియు దాదా సాహెబ్ పాల్ కె అవార్డు గ్రహీత రామానాయుడు గారు ఎంతో కృషి చేశారు. ఈరోజు ఆయన జయంతి. 1936వ సంవత్సరంలో జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడు అనే గ్రామంలో ఈయన జన్మించారు. సినిమాల పై ఉన్న అభిమానంతో ‘సురేష్ ప్రొడక్షన్స్’ ను స్థాపించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు రామానాయుడు గారు. మొదట్లో ప్లాప్ లు ఎదుర్కొన్న రామానాయుడుగారు ఎన్టీఆర్ ‘రాముడు భీముడు’ చిత్రంతో మొదటి హిట్ అందుకున్నారు.

అటు తర్వాత కూడా పలు ప్లాప్ లు మూటకట్టుకున్నారు. ఇక తాడో పేడో తేల్చుకోవాలి అనుకున్న తరుణంలో ‘ప్రేమ్ నగర్’ చిత్రం ఇతన్ని ఆదుకుంది. అటు తరువాత ఈయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. అగ్ర హీరోలందరితో సినిమాలు నిర్మించిన రామా నాయుడు గారు… ట్యాలెంట్ ఉన్న ఎంతో మంది కొత్త దర్శకులకు కూడా లైఫ్ ఇచ్చారు. 2015 ఫిబ్రవరి 8న రామానాయుడు గారు స్వర్గాస్తులయ్యారు. ఇక ఈరోజున ఆయన జయంతి సందర్బంగా టాలివుడ్ ప్రముఖులంతా… రామానాయుడు గారితో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఇండస్ట్రీకి రామానాయుడు గారు చేసిన సేవలు వర్ణనాతీతం అంటూ వారు చెప్పుకొస్తున్నారు. ఇక రామానాయుడు గారికి అతని మనవళ్లు రానా,నాగ చైతన్య లు అంటే ఎంతో ఇష్టం. వీళ్ళని హీరోలుగా చూడాలని.. అంతే కాకుండా వీరి పెళ్ళిళ్ళు చూడాలని కూడా కోరుకునే వారట.వీళ్ళని హీరోలుగా అయితే చూసారు.. కానీ వీళ్ళ పెళ్ళిళ్ళు చూడాలి అనే కోరిక మాత్రం తీరకుండానే.. ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది.ఇది పక్కన పెడితే.. ఈరోజు రామానాయుడుగారి జయంతి కాబట్టి ఆయనకు సంబందించి కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను చూద్దాం రండి:

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus