ఎన్టీఆర్ కోప్పడడంతో దాసరి కెరీర్ ముగిసిపోయిందనుకున్నారట

దేశం గర్వించదగ్గ దర్శకులలో దాసరి నారాయణ ఒకరు. టాలీవుడ్ లో దాసరి నారాయణది ఒక గొప్ప అధ్యాయం. దర్శకుడిగా, నటుడిగా, రచయితగా విజయం సాధించి బహుముఖ ప్రజ్ఞ అనిపించుకున్నారు. ఆయన కెరీర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయో, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయో లెక్కే లేదు. అప్పట్లో దాసరి ఏడాదిలో పదుల సంఖ్యలో చిత్రాలు తీసేవారు. రాత్రి పగలు తేడా లేకుండా సినిమా కోసం పని చేశేవారు. మరి అన్ని సినిమాలు చేయాలంటే ఎంత క్రమ శిక్షణ ఉండాలి, ఎంత నిబద్దత ఉండాలి.

అలాంటి దాసరి కూడా ఓ సందర్భంలో ఎన్టీఆర్ కోపానికి గురయ్యారట. ఎన్టీఆర్ బొబ్బిలి పులి సమయంలో ఈ అరుదైన సంఘటన జరిగిందట. ఈ విషయాన్నీ ఓ వేదికపై దాసరి స్వయంగా చెప్పడం జరిగింది. 1982లో చెన్నైలోని ఏ వి ఎమ్ స్టూడియో బొబ్బిలి పులి షూటింగ్ జరుగుతుంది. క్రమశిక్షణకు మారుపేరైన ఎన్టీఆర్ ఉదయాన్నే సెట్ కి వచ్చారట. సెట్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్ డైలాగ్స్ రాసుకుంటున్న దాసరిని చూడగానే తీవ్ర ఆగ్రహానికి గురయ్యారట.

ఉదయం ఏడు గంటల లోపు మొదటి షాట్ పూర్తవ్వాలన్న నియమం పెట్టుకున్న ఎన్టీఆర్ కి దాసరి తీరు నచ్చక స్టూడియో నుండి ఆగ్రహంగా ఇంటి నుండి వెళ్లిపోయారట. ఆ సంఘటనతో సెట్ మొత్తం షాక్ కి గురికావడంతో పాటు దాసరి కెరీర్ ప్రమాదంలో పడినట్టే అని అందరూ చెవులు కొరుకున్నారట. హఠాత్ పరిణామంతో చిత్ర నిర్మాత వడ్డే రమేష్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేసినా ఆయన కోపం తగ్గలేదట. ఐతే దాసరి సెట్స్ లో బెటర్మెంట్ కోసం రాసిన డైలాగ్స్ ఎన్టీఆర్ కి స్వయంగా నటించి వినిపించడంతో ఎన్టీఆర్ దాసరిని హత్తుకొని, డైలాగ్స్ అంటే ఇలా ఉండాలని సెట్ కి వెళ్లి షూటింగ్ లో పాల్గొన్నారట. బొబ్బిలి పులి సినిమాలో క్లైమాక్స్ కోర్ట్ రూమ్ సన్నివేశాలు ఎంత ఫేమస్సో తెలిసిందే.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus