Balakrishna: ఇప్పటవరకూ ఎవరు చూడని బాలకృష్ణ రేర్ ఫోటో గ్యాలరీ!

దివంగత నటుడు.. మహా నాయకుడు అయిన నందమూరి తారక రామారావు కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నందమూరి బాలకృష్ణ. కేవలం ఎన్టీఆర్ కొడుకు కాబట్టే.. హీరోగా రాణిస్తున్నాడు అనుకుంటే అది తప్పే అవుతుంది. నందమూరి హరికృష్ణ వంటి వారు కూడా హీరోగా నిలదొక్కుకోవాలని ట్రై చేశారు. కానీ బాలయ్య మాత్రమే సక్సెస్ అయ్యాడు. తన నటనతో ప్రేక్షకులను అలరించగలిగాడు కాబట్టే.. స్టార్ హీరో అయ్యాడని చెప్పాలి.

‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన బాలకృష్ణ.. ఆ తరువాత ‘రామ్ రహీమ్’ ‘రౌడీ రాముడు కొంటె కృష్ణుడు’ వంటి చిత్రాల్లో నటించాడు.అయితే ‘మంగమ్మగారి మనవడు’ చిత్రం బాలకృష్ణ కు బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. కోడిరామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా.. ఓ పక్క ‘లారీ డ్రైవర్’ ‘రౌడీ ఇన్స్పెక్టర్’ ‘బొబ్బిలి సింహం’ వంటి మాస్ సినిమాలు చేస్తూనే మరో పక్క..’భైరవద్వీపం’ వంటి పౌరాణిక చిత్రాల్లో కూడా నటించాడు బాలయ్య.

‘సమరసింహా రెడ్డి’ ‘నరసింహా నాయుడు’ ‘చెన్నకేశవ రెడ్డి’ వంటి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్న చిత్రాల్లో కూడా నటించాడు. ‘డైరెక్టర్ ఏమి చెబితే అది గుడ్డిగా చేసేస్తాడు బాలయ్య’ అని చాలా మంది చెబుతుంటారు. అంతలా డైరెక్టర్ కు సరెండర్ అయిపోతాడు కాబట్టే.. అతని నుండీ వైవిధ్యమైన సినిమాలు వచ్చాయని చెప్పొచ్చు. ఇక తన ‘బసవతారకం’ క్యాన్సర్ హాస్పిటల్ నుండీ ఎంతో మందికి ఉచిత వైద్యం చేయించి.. వారి ప్రాణాలను కాపాడాడు బాలయ్య. ‘కాస్త కోపిష్టిలా కనిపించినా బాలయ్య బంగారం’ అని ఎంతో మంది దర్శకులు చెబుతుంటారు. ఇక  బాలకృష్ణకు సంబంధించి కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను చూద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

 

27

28

29

30

31

32

33

 

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus