Prabhas Rare Photos: ఇప్పటవరకూ ఎవరు చూడని ప్రభాస్ రేర్ ఫోటో గ్యాలరీ!

పెదనాన్న నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ… అది ఎంట్రీ వరకే పనికొచ్చింది తప్ప స్టార్ ఇమేజ్ కు దారి చూపించలేకపోయింది. కాని క్రమ క్రమంగా ఎదుగుతూ… పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఎవరి గురించి చెబుతున్నానో ఈ పాటికే మీకు అర్థమైపోయుంటుంది కదా..! యెస్ .. మీ గెస్ కరెక్టే..! మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించే..! కృష్ణంరాజు నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ప్రభాస్ కు హిట్ కానీ.. స్టార్ డం కానీ వెంటనే దొరకలేదు. అప్పటికే కృష్ణంరాజు ఫేడ్ అవుట్ అయిపోవడంతో అతని క్రేజ్ .. ప్రభాస్ కు ఎక్స్ ట్రా మైలేజ్ ఇవ్వలేకపోయింది.

హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘ఈశ్వర్’ యావరేజ్ గా నిలవగా ‘రాఘవేంద్ర’ ప్లాప్ అయ్యింది. ఇక తరువాత వచ్చిన ‘వర్షం’ మొదటి హిట్ అందుకున్నాడు. ఆ తరువాత మాస్ ను ఆకట్టుకోవాలి అని ట్రై చేసిన ‘అడివి రాముడు’ , నటుడిగా మరింత గుర్తింపు తెచ్చుకోవాలి అని ట్రై చేసిన ‘చక్రం’ సినిమాలు నిరాశనే మిగిల్చాయి. ఓ పక్క రవితేజ, అల్లు అర్జున్ లు ఓ రేంజ్ లో దూసుకుపోతుంటే ప్రభాస్ ను పట్టించుకున్నవారు లేరనే చెప్పాలి. కరెక్ట్ గా అదే టైంలో వచ్చిన ‘ఛత్రపతి’ చిత్రంతో ప్రభాస్ రేంజ్ ను అమాంతం పెంచేశాడు దర్శకుడు రాజమౌళి. ఓ స్టార్ హీరోకి ఉండాల్సిన లక్షణాలు పుష్కలంగా ప్రభాస్ లో ఉన్నాయని … రాజమౌళి ప్రేక్షకులకి గుర్తుచేశాడు. ఇక అలా ‘బుజ్జిగాడు’ ‘బిల్లా’ ‘డార్లింగ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రాలతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అయితే మళ్ళీ ప్రభాస్ అభిమానులకి కావాల్సిన మాస్ హిట్ ఇచ్చింది మాత్రం కొరటాల శివ నే..! ఈ చిత్రం ప్రేక్షకులు ఏమాత్రం థియేటర్లకు రాని ఫిబ్రవరి లో విడుదలయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో ‘బాహుబలి’ కి ఏకంగా 5 ఏళ్ళు కేటాయించాడు ప్రభాస్. అలాంటి టైం లో ఏ హీరో అంత ఓపికగా ఉండడు అనే చెప్పాలి.అదే సమయంలో 5,6 సినిమాలు చేసుకున్నా 100 కోట్ల వరకూ సంపాదించుకునే వాడు ప్రభాస్. కానీ ఎంతో డెడికేషన్ తో ఆ ప్రాజెక్ట్ చేసి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ‘సాహో’ విషయంలో కూడా ఇలాగే చేశాడు. ఇచ్చిన మాట కోసం ఓ కుర్ర డైరెక్టర్ సుజీత్ తో ఈ భారీ సినిమా చేసాడు. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా భారీ కలెక్షన్లు రాబట్టి ప్రభాస్ స్టార్ డం ఏంటనేది ప్రూవ్ చేసింది. ఈ 17 ఏళ్ళ ప్రభాస్ కెరీర్ లో.. మరే హీరోకి సొంతం కాని ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రభాస్ కు దక్కింది. కేవలం ప్రేక్షకులే కాదు సినీ ఇండస్ట్రీ లో చాలా మంది హీరోలు ప్రభాస్ అంటే చాలా ఇష్టపడతారు. అందుకే అతన్ని సెలబ్రిటీలు డార్లింగ్ అంటే… చాలా మంది ఆర్టిస్ట్ లు టాలీవుడ్ ‘రేలంగి మావయ్య’ అంటుంటారు. ఇక ప్రభాస్ కు సంబందించిన రేర్ అండ్ అన్-సీన్ పిక్స్ కొన్ని చూద్దాం రండి..!

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

 

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus