నయా అందాలు చూడవయ్యా అంటున్న ఖన్నా బ్యూటీ.!

అందంతో మాత్రమే కాదు అభినయంతోనూ అలరించగల సత్తా తనకు పుష్కలంగా ఉందని ఇటీవల విడుదలైన “తొలిప్రేమ”తో ప్రూవ్ చేసుకోన్న రాశీఖన్నాకు గ్లామర్ విషయంలోనూ ఎలాంటి హద్దులు, ఇబ్బందులు లేవనే విషయం తన మునుపటి చిత్రాలు చూస్తే అర్ధమవుతుంది. కానీ.. ఇటీవల కాలంలో అభినయ సామర్ధ్యంతోపాటు అందం కూడా సమపాళ్లలో ఉండడం అనేది కంపల్సరీ. లేదంటే.. హీరోయిన్లను పెద్దగా జనాలు కూడా పట్టించుకోవడం లేదు. అందుకే.. రాశీఖన్నా కొత్తగా ఒక ఫోటోషూట్ చేయించుకొంది. రెడ్ డ్రెస్ లో రాశీ కొత్త ఫోటోలు ఆన్ లైన్ లో వైరల్ అవ్వడమే కాక కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించాయి.

రాశీ ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా, తెలుగులో రెండు సినిమాలు సైన్ చేసింది. వాటిలో “శ్రీనివాస కళ్యాణం” ఒకటి. ఈ సినిమాపై ఆమె చాలా ఆశలు పెట్టుకొంది. అయితే.. ఈ సినిమాలో కూడా రాశీది పద్ధతి గల అమ్మాయి పాత్ర కావడంతో.. తన ఫ్యాన్స్ తన అందాలను ఎక్కడ మిస్ అవుతారనుకుందో ఏమో కానీ.. ఉన్నపళంగా ఒక హాట్ ఫోటోషూట్ చేయించుకొంది. ఈమధ్యకాలంలో హీరోయిన్ల అందాలు సినిమాల్లో కంటే ఎక్కువగా మ్యాగజైన్ కవర్ల మీద ప్రత్యక్షమవుతున్న సంగతి తెలిసిందే. ఆ జాబితాలో త్వరలో రాశీ కూడా చేరుతుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus