కోటికి ఆశపడి మంచి సినిమాని వదులుకున్న రాశీ ఖన్నా

ఎంతో అనుభవం ఉన్న హీరోలు సైతం కథల ఎంపికలో తడబడుతుంటారు. హిట్ అవుతుందన్న కథ ఫట్ అవుతుంది. లైట్ తీసుకున్న కథ సూపర్ హిట్ అయి కూర్చుంటుంది. రాశీఖన్నా విషయంలో ఇప్పుడు అదే జరిగింది. వివరాల్లోకి వెళితే.. శతమానం భవతి మూవీ తర్వాత సతీష్ వేగేశ్న తెరకెక్కించిన సినిమా శ్రీనివాస కల్యాణం. ఇందులో నితిన్, రాశీ ఖన్నాలు హీరో హీరోయిన్స్ గా నటించారు. ఇంతమంచి కథలో భాగం కావడం చాలా సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందని రాశీఖన్నా పలు ఇంటర్వ్యూ లలో వెల్లడించింది. అయితే ఈ సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది. మరి ఆమె రిజెక్ట్ చేసిన ఏంటో తెలుసా గీత గోవిందం. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట లావణ్య త్రిపాఠీని అనుకున్నారు.

కానీ ఆమె కెరీర్ ట్రాక్ రికార్డు అంత బాగా లేకపోవడం, విజయ్ దేవరకొండ పక్కన ఎలా ఉంటుందో అన్న సందేహంతో వెనక్కి తగ్గారు. తొలిప్రేమతో యువతలో క్రేజ్ సంపాదించుకున్న రాశీఖన్నాని హీరోయిన్ గా నటించమని సంప్రదించారు. ఆమె నటించడానికి ఓకే చెప్పిందని … కానీ రెమ్యునరేష్ కోటి రూపాయలు తగ్గేది లేదని చెప్పడంతో ఆమెను తప్పించి రష్మికని తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమా నిన్న రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. సామాన్యులతో పాటు రాజమౌళి, మహేష్ బాబు తదితరులు చిత్ర బృందాన్ని అభినందిస్తున్నారు. దీంతో రాశీఖన్నా కోటికి ఆశపడి అంతకన్నా విలువైన విజయాన్ని కోల్పోయిందని సినీ పండితులు చెప్పుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus