సోలో బతుకు సో బెటరు అంటున్న రష్మీ

అడల్ట్ కామెడీ షో లలో హాట్ డ్రస్లు వేసి యువకుల మతి పోగొడుతున్న యాంకర్ రష్మీకి  సినిమా ఆఫర్లు వెల్లువెత్తున్నాయి. మొన్న గుంటూరు టాకీస్ తో అందాల ఆరబోసిన ఈ భామ నేడు “తను వచ్చేనంట” సినిమాతో అలరించింది. ఈ సినిమాకి మంచి టాక్ రావడంతో ఫుల్ ఖుషీగా ఉంది. ఈ సందర్భంలో ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన ఇష్టాలను షేర్ చేసుకుంది. తనకి దేవుడు మంచి బాడీని ఇచ్చాడని దానిని టాటూ, పియరింగ్స్  తో పాడు చేసుకోనని వెల్లడించింది.

” నా ఒంటిపై పచ్చబొట్టు వేసుకునేందుకు మా అమ్మ ఒప్పుకోదు” అని రష్మి వివరించింది. తనని ఎవరైనా పెళ్లి ఎప్పుడు? అని అడిగితే చిరాకు కలుగుతుందని తెలిపింది. “నేను కనిపిస్తే చాలు .. అందరూ నీ పెళ్లి ఎప్పుడు? డేటింగ్ లో ఉన్నారా? అని అడుగుతుంటారు. నేను కష్టపడుతున్నా, సొంత కాళ్ల మీద జీవిస్తున్నా, ఎంతో సంతోషంగా ఉన్నా. ఇప్పుడు పెళ్లి గురించి ఎందుకు ?, ఏం నేను ఒంటరిగా, స్వేచ్ఛగా బతకడం మీకు ఇష్టం లేదా? ” అని ఎదురు ప్రశ్నించింది. రష్మీ చెప్పిన విషయంలోనూ విషయం ఉందండోయ్. ఇకనైనా ఆమెను విలేకరులు ఇటువంటి ప్రశ్నలు అడగడం మానుకుంటారో .. లేదో.. చూడాలి.

https://www.youtube.com/watch?v=_9GzKg2OnwU

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus