Rashmika: మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకి ఓకే చెప్పిన రష్మిక.. ఇది కూడా..!

రష్మిక మందన కెరీర్ ఇప్పుడు కొంచెం స్లో అయ్యింది. శ్రీలీల వరుస ప్రాజెక్టులు చేజిక్కించుకోవడంతో.. దర్శకనిర్మాతలు రష్మిక పై ఎక్కువగా ఫోకస్ పెట్టడం లేదు. ‘మైత్రి’ బ్యానర్లో నితిన్ – వెంకీ కుడుముల ప్రాజెక్టులో ఈమె భాగం కావాల్సి ఉంది. అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. కానీ ఈమె డేట్స్ ఖాళీ లేక.. తప్పుకున్నట్టు ఈమె టీం ప్రకటించింది. దీంతో శ్రీలీలని తీసుకున్నట్లు టాక్ నడిచింది. ‘పుష్ప 2 ‘ తప్ప ..

ఇప్పుడు రష్మిక చేతిలో బడా ప్రాజెక్టు అంటూ ఏమీ లేదు. ‘యానిమల్’ రిలీజ్ కి రెడీగా ఉంది.రవితేజ – గోపీచంద్ మలినేని సినిమాలో కూడా నటిస్తుంది అంటున్నారు. అయితే ఊహించని విధంగా రష్మికకి విమెన్ సెంట్రిక్ సినిమాల్లో నటించే ఛాన్స్ లు లభిస్తున్నాయి. ఆల్రెడీ ఈ బ్యూటీ ‘రెయిన్ బో’ అనే సినిమాలో నటిస్తుంది. ఇది తెలుగు- తమిళ భాషల్లో రూపొందుతున్న బై లింగ్యువల్ మూవీ.వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది.

దీంతో పాటు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో దర్శకత్వంలో మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయడానికి రెడీ అయ్యింది రష్మిక. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె సైన్ చేసేసినట్లు వినికిడి. విచిత్రం ఏంటంటే.. ఈ రెండు సినిమాలు సమంత చేయలేక వదిలేసినవే కావడం. అవును ‘రెయిన్ బో’ సమంత చేయాల్సిన సినిమా. ఇక రాహుల్ రవీంద్రన్ ప్రాజెక్టు కూడా సమంత చేయాలి. ప్రస్తుతం ఆమెకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో రష్మిక (Rashmika) చేతిలోకి వచ్చి పడింది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus