Rashmika: కఠినంగా శిక్షించాలి రష్మిక ఫేక్ వీడియో పై ఫ్యాన్స్ డిమాండ్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక మందన్న నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈమె పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి రష్మిక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇలా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులతో అన్ని విషయాలు తెలియజేసే ఈమెకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఇప్పటివరకు రష్మిక ఎప్పుడు కూడా ఇలాంటి వీడియోలు షేర్ చేయలేదు. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యపోయారు రష్మిక ఏంటి ఇలాంటి వీడియో షేర్ చేశారు అంటు సందేహాలను కూడా వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా డీప్ బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ అలాగే పొట్టి నిక్కర్ ధరించి పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఈమె లిఫ్ట్ లో వెళ్తూ ఉన్నటువంటి వీడియో వైరల్ గా మారింది.

రష్మిక (Rashmika) ఎప్పుడు కూడా ఇలాంటి డ్రెస్ ధరించి బయటకు రాలేదు అందుకే అనుమానం వచ్చినటువంటి కొంతమంది నెటిజన్స్ ఈ వీడియో గురించి ఆరా తీయగా ఇది ఫేక్ అని తెలిసిపోయింది. ఈ వీడియో జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ కి సంబంధించినది. ఆమె వీడియోని ఎవరో రష్మిక ఫేస్ తో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

ఇక ఈ విషయాన్ని సాక్షాలతో సహా బయట పెట్టడంతో ఎంతోమంది అభిమానులు ఇలా మోసం చేసినటువంటి వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమితాబ్ బచ్చన్ సైతం ఈ వీడియో పై స్పందిస్తూ ఇలాంటి పని చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ ఆయన కూడా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఇప్పటివరకు ఈ పోస్ట్ పై రష్మిక స్పందించకపోవడం గమనార్హం.

https://twitter.com/abhisheksay/status/1721088692675072009?s=46&t=HmD7ymNVDZzGib7VTPdfmg

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus