మ్యాగజైన్ కవర్ పేజీ పై ఫోటో పడాలి అంటే మాటలు కాదు. దానికి ఎంతో కృషి చెయ్యాలి. అలా అని దానికోసమే కృషి చెయ్యాలి అని ఆశపడి కష్టపడితే సరిపోదు.. ఎంతో గుర్తింపు తెచ్చుకోవాలి. పెద్ద పెద్ద బిజినెస్ మెన్ లు, స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లకు మాత్రమే అది సాధ్యం అవుతుంది. అయితే మన రష్మిక మందన మాత్రం 5 ఏళ్ళ వయసులోనే కవర్ పేజీ పై మెరిసింది.’గోకులం’ అనే పత్రిక కోసం రష్మిక ఈ ఫొటో షూట్ లో పాల్గొందట.
ఈ ఫోటోని స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది. తన తల్లి ఈ ఫోటోని దాచి పెట్టింది అని కూడా తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రష్మిక ఎంతో క్యూట్ గా ఈ ఫోటోలో కనిపిస్తుంది. మళ్ళీ అలాంటి ఫోజ్ నే ఇస్తూ ఇప్పటి ఫోటోని కూడా షేర్ చేసింది. ఇక ఈ ఫోటో గురించి రష్మిక స్పందిస్తూ.. ” 2001లో నా మొట్టమొదటి మ్యాగ్జైన్ కవర్ షూట్ ఇది!
దానికోసం ఆ రోజు జరిగిన ఫొటో షూట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను ! ఈ మ్యాగజైన్‌తో పాటు… ఇప్పటి వరకూ నా ఫొటోతో వచ్చిన ప్రతి పత్రికను మా అమ్మ దాచి పెడుతూనే ఉంది. ‘మీ ప్రేమాభిమానాలతోనే ఈ స్థాయికి ఎదుగుతానని అస్సలు అనుకోలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. నా జీవితంపట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను” అంటూ రష్మిక మందన చెప్పుకొచ్చింది.