Rashmika: మోత మోగుతున్న కన్నడ సోషల్ మీడియా.. దీనికి కూడా రష్మిక ఆన్సర్ ఇస్తుందా?
- October 27, 2026 / 10:58 PM ISTByFilmy Focus Desk
గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ – రష్మిక మందనకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రష్మిక విషయంలో విజయ్ ఓ రెడ్ ఫ్లాగ్ అని ట్రోల్ చేశారు. అయితే ఈ కామెంట్లకు తొలుత రష్మిక, ఆ తర్వాత కాసేపటికి విజయ్ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత వారి టీమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఈ విషయం ఓ కొలిక్కి వచ్చింది. వారిద్దరి సరదా మాటలను సీరియస్ తీసుకొని ట్రోల్ చేస్తున్నారు అని టీమ్ చెప్పింది.
Rashmika
అయితే, ఇప్పుడు మరో చర్చ సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అదే ‘కన్నడ సినిమా మీద ఆమె అభిమానం. కర్ణాటక నెటిజన్లు రష్మికపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇది తొలిసారి కాదు కూడా. ఎన్నో ఏళ్లుగా ఆమె గురించి ఇదే తరహాలో మాట్లాడుతున్నారు కన్నడ ప్రజలు. కన్నడలో కెరీర్ స్టార్ట్ చేసి తెలుగుతో గుర్తింపు తెచ్చుకుని పాన్ ఇండియా స్థాయికి వెళ్లిన వారు తర్వాత తన మూలాలను మర్చిపోకూడదు అని రాసుకొచ్చారు.
‘కిరిక్ పార్టీ’ సినిమాతో కన్నడ ప్రేక్షకులకు దగ్గరైన రష్మిక.. ఆ తర్వాత ‘అంజనీ పుత్ర’, ‘చమక్’, ‘యజమాన’, ‘పొగరు’ సినిమాలు చేసింది.. అయితే తెలుగులోకి వచ్చిన తర్వాత మళ్లీ అటువైపు చూడలేదు. ఒక్క కన్నడ సినిమా కూడా ఓకే చేయలేదు. హిందీ, తమిళ సినిమాలు చేస్తూ వచ్చింది. ఇదే విషయాన్ని కన్నడిగులు ప్రశ్నిస్తున్నారు. కన్నడ దర్శకులు ఆమెను అప్రోచ్ అవ్వడం లేదా? లేక ఆమెనే నో చెబుతోందా? అనేది తెలియడం లేదు.
ఈ నేపథ్యంలో చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఈ విమర్శ మీద కూడా రష్మిక స్పందిస్తుందేమో చూడాలి. ఎందుకంటే ఆమె మీద కన్నడ అభిమానులు చేస్తున్న విమర్శలు చాలా పెద్దవి కావడం గమనార్హం. ఈ లెక్క తేలాలి అంటే ఆమో ఓ కన్నడ సినిమా చేయాల్సిందే. అయితే అది ఇప్పట్లో సాధ్యమేనా అంటే కష్టమే అనిపిస్తోంది. ఎందుకంటే వరుస సినిమాలతో రష్మిక ఇప్పుడు చాలా బిజీ.
















