Rashmika: ఆ హీరోల సినిమాల విషయంలో బాధపడుతున్న రష్మిక!

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి రష్మిక మందన్న. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం తెలుగులో కూడా సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా తెలుగులో కూడా మంచి సక్సెస్ కావడంతోఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు. ఇక తెలుగులో ఈమె నటించిన పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.

ఈ సినిమా విడుదలైన తర్వాత రష్మిక (Rashmika) బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇలా బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు .అయితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రష్మిక తాను తన కెరియర్లో స్టార్ హీరోలతో నటించే సినిమా అవకాశాలను మిస్ చేసుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతుంటానని తెలిపారు.

ఇలా ఈమె మిస్ చేసుకున్నటువంటి ఆ స్టార్ హీరోలు ఎవరు ఆ సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే..టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవితో ఈమెకు కలిసి నటించే అవకాశం వచ్చిందట ఆయనప్పటికీ ఆ అవకాశాన్ని వదులుకున్నారు ఇలా స్టార్ హీరోతో నటించే అవకాశం రావడం ఎంతో అదృష్టం అయితే అలాంటి అవకాశాన్ని తాను వదులుకున్నానని తెలిపారు. చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాలో ఈమెకు అవకాశం రాగా ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు తెలిపారు.

అదేవిధంగా కోలీవుడ్ స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు విజయ్ సరసన కూడా ఈమెకు మాస్టర్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట అయితే కొన్ని కారణాలు వల్ల ఈ సినిమాఅవకాశాన్ని కూడా వదులుకున్నారని తెలిపారు ఇలా ఇద్దరు హీరోలతో నటించే అవకాశాన్ని కోల్పోవడంతో తాను ఇప్పటికి బాధపడుతుంటానని తెలిపారు. అయితే అనంతరం ఈమె విజయ్ హీరోగా వారసుడు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus