గీత గోవిందం షూటింగ్ లో జరిగిన వింత అనుభవాన్ని పంచుకొన్న రష్మిక

సీన్ లో పర్ఫెక్షన్ కోసం దర్శకులు హీరో లేదా హీరోయిన్ల మీద చేయి జేసుకోవడం లేదా తిట్టడం అనేవి షూటింగ్స్ లో చాలా రెగ్యులర్ గా జరిగే విషయాలు. అయితే.. కన్నడ బ్యూటీ రష్మిక మండన్నాకు మాత్రం “గీత గోవిందం” సెట్స్ కు అంతకుమించిన అనుభవం ఎదురైందట. సాధారణంగా సినిమా షూటింగ్ స్పాట్ కి టైమ్ కి వచ్చే రష్మిక ఒకరోజు లేట్ గా వచ్చిందట. షూటింగ్ స్పాట్ లో రష్మిక అడుగు పెట్టినప్పట్నుంచి ఆమెతో ఒక్కరూ మాట్లాడలేదట. పైగా ఎవరితోనైనా మాట్లాడదామని దగ్గరకి వెళ్తే వాళ్ళందరూ మొహం తిప్పేసుకొనేవారట. చాలాసేపు సైలెంట్ గా ఉన్న రష్మిక ఒక్కసారిగా బరస్ట్ అయిపోయి ఏడ్వడం మొదలెట్టేసిందట. దాంతో.. డైరెక్టర్ పరశురామ్ పరిగెట్టుకుంటూ వచ్చి “హేయ్ ఇదంతా ఒక ప్రాంక్, ఇందాకట్నుంచి నిన్ను కెమెరా ఫాలో అవుతుంది. నువ్వు గమనించలేదా?” అని అడిగి బుజ్జగించి.. ఇంకోసారి లేట్ గా రాకు అని సున్నితంగా మందలించాడట. ఈ ఇన్సిడెంట్ & ఎక్స్ పీరియన్స్ ను ఇటీవల షేర్ చేసుకొని తెగ నవ్వుకొంది రష్మిక.

ఇకపోతే.. రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన “డియర్ కామ్రేడ్” అనే సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా నితిన్ తో “భీష్మ” అనే సినిమా కూడా సైన్ చేసింది. ఈ రెండు సినిమాలు కాకుండా కన్నడలో మరో సినిమా సైన్ చేసింది. ఈ మూడు సినిమాలు సైన్ చేసి చాలా నెలలు కావస్తోంది. ప్రస్తుతం ఆమె కొత్త కథలేమీ వినడం లేదట. ఈ మూడు సినిమాల షూటింగ్ పూర్తికాగానే.. కొన్నాళ్లపాటు రెస్ట్ తీసుకోవాలనుకొంటుందట రష్మిక.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus