Rashmika: అలాంటప్పుడే సినిమాలు చూడండి.. లేకపోతే వద్దు: రష్మిక కామెంట్స్‌ వైరల్‌!

రష్మిక మందన (Rashmika) సినిమాల్లోకి వచ్చి అప్పుడే పదేళ్లు అయిపోయింది. మామూలుగా హీరోయిన్లకు ఇంత కెరీర్‌ స్పాన్‌ అయ్యాక చిన్నగా అవకాశాలు తగ్గుతాయి. కానీ రష్మిక విషయంలో ఇది జరగడం లేదు. దీనికి కారణం ఆమె ఒక్క దగ్గరే స్టిక్‌ అవ్వకుండా అన్ని పరిశ్రమలకూ వెళ్తే తన కెరీర్‌ను బిల్డ్‌ చేసుకుంటోంది. అందుకే సౌత్‌, నార్త్‌ అనే తేడా లేకుండా ఆమెను ఇప్పుడు సినిమాల్లోకి తీసుకుంటున్నారు. ప్రేక్షకులు అభిమానిస్తున్నారు కూడా. అయితే ఆమె ఓ సీన్‌ ఉంది అంటే ఏకంగా సినిమా నుండి తప్పుకుంటాను అని చెబుతోంది.

Rashmika Mandanna

ఓ వైపు అగ్ర హీరోల సరసన నటిస్తూనే, మహిళా ప్రాధాన్య కథలూ ఓకే చేస్తూ ముందుకెళ్తోంది రష్మిక. అలా ఇప్పుడు ‘మైసా’ అనే లేడీ ఓరియెంటెడ్‌ సినిమా అనౌన్స్‌ చేసింది. ఆ లుక్‌తో చిన్నగా షాకిచ్చింది కూడా. దశాబ్దం కెరీర్‌ గురించి రివైండ్‌ చేస్తే మీకేమనిపిస్తోంది అని రష్మికను అడిగితే.. సినిమాల్లోకి రావాలని చాలామంది ఆశపడుతున్నారు కానీ కొన్నేళ్ల క్రితం దక్షిణ భారత కుటుంబాలలో చిత్రపరిశ్రమలోకి రావడం తప్పుగా భావించేవారు.

నా కెరీర్‌ ప్రారంభంలోనూ నా కుటుంబం అంగీకరించలేదు. ఆ తర్వాత ఓకే అయ్యారు అని గ్రౌండ్‌ రియాలిటీ చెప్పింది రష్మిక (Rashmika). ఇక మీకు నచ్చని పాత్ర ఏది అంటే.. పాత్ర అని కాదు కానీ.. స్మోకింగ్‌ను తాను ప్రోత్సహించనని, సినిమాలో తన పాత్రకు స్మోకింగ్‌ అలవాటు ఉంటే, ఆ పాత్రనే అంగీకరించను అని తేల్చేసింది. తెరపై ఎప్పటికీ అలాంటి పాత్రలో కనిపించను అని తేల్చేసింది రష్మిక.

ఇక ‘యానిమల్‌’ సినిమా కాంట్రవర్శీ గురించి కూడా ఆమె మాట్లాడింది. ప్రతి ప్రేక్షకుడు తెరపై చూసిన ప్రభావితమవుతాడని నేను అనుకోను. ఒకవేళ అలా అవుతారనుకుంటే నచ్చిన సినిమాలే చూడండి.. మిగిలినవి వదిలేయండి అని సూచించింది రష్మిక. దీంతో ఆమె కామెంట్స్‌ వైరల్‌గా మారాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus