యాడ్‌ల యందు అండర్‌వేర్ యాడ్‌లు వేరయా… అంటుంటారు మన పెద్దలు. అబ్బాయి, అమ్మాయి మధ్య ఆకర్షణో, ప్రేమ ఆ అండర్‌వేర్‌లు చూసే మొదలైపోతాయి అని చూపిస్తుంటారు. దీంతో గతంలో వచ్చిన ఈ యాడ్‌లపై చాలా కాంట్రవర్శీలు వచ్చాయి. తాజాగా ఇలాంటి వివాదంలోనే చిక్కుకుని ట్రోల్స్ ఎదుర్కుంటోంది యువ కథానాయిక రష్మిక. ఇటీవల ఆమె నటించిన ఇలాంటి యాడ్ ఒకటి బయటకు వచ్చింది. విక్కీ కౌశల్, రష్మిక మధ్య ఈ అండర్ వేర్ యాడ్‌ను తెరకెక్కించారు.
జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేసేటప్పుడు విక్కీ కౌశల్ అండర్ వేర్ స్ట్రాప్ కనిపిస్తుంది. దాంతో రష్మిక అతని మీద (?) మనసు పడినట్లు ఓ రెండు యాడ్‌లు తెరకెక్కించారు. వీటిని చూసిన అభిమానులు రష్మికకు ఇలాంటి యాడ్‌లు అవసరమా? అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. తొలుత ఒకటి, రెండుగా కనిపించిన ట్రోల్స్ ఇప్పుడు వందలు, వేలు అయిపోయాయి. అసలు రష్మిక ఇలాంటి యాడ్ ఎందుకు చేసింది అనేది చూస్తే… మనకు చిన్న క్లారిటీ వస్తుంది.
దక్షిణాదిలో రష్మిక ఇప్పుడు దూసుకుపోతోంది. అగ్ర హీరోల సరసన నటిస్తోంది. అదే సమయంలో బాలీవుడ్‌లోనూ పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రెండు సినిమాలు (‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బై’) చేస్తోంది కూడా. ఈ క్రమంలో మరింత ఫేమ్, గుర్తింపు కోసం బాలీవుడ్ హీరోలతో యాడ్స్ చేస్తోంది. ఆ క్రమంలో వచ్చిందే ఈ యాడ్. ఫేమ్ కోసం చూస్తే ట్రోల్స్ రావడం గమనార్హం.
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!