Rashmika: పాతికేళ్లకే రష్మిక ఇంత సంపాదించిందా?

కన్నడ కస్తూరి రష్మిక మందన్న ఒకవైపు సినిమాలతో మరోవైపు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు. రష్మిక హీరోయిన్ గా నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు హిట్ కావడంతో పాటు ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. తెలుగులో గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న హిందీలో కూడా ఇదే స్టేటస్ ను సొంతం చేసుకుంటానని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు.

చిన్న వయస్సులోనే రష్మిక సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వగా రష్మిక వయస్సు ప్రస్తుతం కేవలం 25 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. హిందీలో రష్మిక చేతిలో 2 సినిమాలు ఉండగా ఒక్కో సినిమాకు రష్మిక పారితోషికం 4 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని బోగట్టా. నేషనల్ క్రష్ గా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ నచ్చిన కథలను ఎంచుకుంటూ, స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూ సినిమాసినిమాకు క్రేజ్ ను పెంచుకుంటున్నారు.

రష్మిక ఇప్పటివరకు సంపాదించిన ఆస్తుల విలువ 37 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది. రష్మిక ఏడాది సంపాదన విషయానికి వస్తే గత రెండేళ్లలోనే రష్మికకు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరగగా ఏడాదికి 20 కోట్ల రూపాయలకు అటూఇటుగా సంపాదిస్తున్నారని సమాచారం. ప్రకటనల కోసం ఈ బ్యూటీ 70 లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

రష్మిక నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా మార్చి 4వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. రష్మిక పుష్ప ది రూల్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. రష్మిక క్రేజ్ ను చూసి ఆమె అభిమానులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. తమిళంతో పాటు ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా రష్మికకు సినిమా ఆఫర్లు భారీ స్థాయిలో వస్తుండగా ఆమె కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus