Rashmika: అలా పిలవడం ఎంతో గర్వంగా ఉంటుంది!: రష్మిక

  • February 1, 2024 / 01:35 PM IST

దక్షిణాది సిని ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ దివంగత సౌందర్య ఒకరు 1992వ సంవత్సరంలో కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయమైనటువంటి సౌందర్య అనంతరం తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించే అవకాశాలను అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె 2004వ సంవత్సరంలో బిజెపి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇలా సౌందర్య మరణించడంతో ఆమె మరణ వార్తను ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పాలి.

ఇకపోతే సౌందర్య బయోపిక్ గురించి తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా రష్మిక మందన్న కూడా సౌందర్య బయోపిక్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రష్మిక మందను కూడా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా పరిచయమయ్యారు. ఈమె కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు తమిళం హిందీ భాష చిత్రాలలో కూడా నటిస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె సౌందర్య బయోపిక్ సినిమా గురించి మాట్లాడారు తనకు సౌందర్య అంటే చాలా ఇష్టం అని అలాంటి ఒక గొప్ప నటి బయోపిక్ సినిమాలో నటించే అవకాశం వస్తే కనుక తప్పకుండా నటిస్తానని ఈమె తెలిపారు. ఇక చిన్నప్పుడు మా నాన్న నన్ను అచ్చం సౌందర్య లాగే ఉన్నావు అని చెప్పేవారు. ఆ క్షణం నేను ఎంతో గర్వంగా ఫీల్ అయ్యే దానిని అంటూ రష్మిక (Rashmika) సౌందర్య బయోపిక్ సినిమా గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus