ఈసారి మరింత సీరియస్ అయిన రష్మిక మందన..!

టాలీవుడ్ లో ప్రస్తుతం గోల్డెన్ హీరోయిన్ ఎవరంటే అందరూ రష్మిక మందన పేరే చెబుతారు అనడంలో అతిశయోక్తి లేదు. మొదటి చిత్రమైన ‘ఛలో’ తోనే బ్లాక్ బస్టర్ కొట్టేసి.. రెండో చిత్రం ‘గీత గోవిందం’ చిత్రంతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టింది ఈ బ్యూటీ. తరువాత ఈమెకు వరుస ఆఫర్లు రావడం మొదలయ్యాయి. అయితే ‘గీత గోవిందం’ సినిమా టైములో హీరో విజయ్ దేవరకొండ తో రష్మిక ప్రేమాయణం నడిపింది వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో సార్లు రష్మిక ఈ విషయం పై క్లారిటీ ఇచ్చినప్పటికీ రూమర్లు ఆగలేదు. తాజాగా.. రష్మికను వ్యక్తిగతంగా కించపరిచేలా, విజయ్ తో అఫైర్ ఉందంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు పెట్టిన ఓ పోస్ట్ తెగ వైరల్ అయింది.

ఇక ఇది చూసిన రష్మిక సహనం కోల్పోయి.. సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. రష్మిక తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. “నటీ నటుల మీద ఇలాంటి విమర్శలు చేస్తే మీకు ఏమొస్తుందో తెలియడం లేదు. యాక్టర్స్ అంటే సాఫ్ట్ టార్గెట్ అవుతారన్న ఉద్దేశంలో కొంతమంది ఉన్నట్టు ఉన్నారు… మేము పబ్లిక్ ఫిగర్ అయినంత మాత్రాన… డైరెక్ట్ గా టార్గెట్ చెయ్యొచ్చని కాదు.. అర్థం..! నెగటివ్ కామెంట్స్ ను పట్టించుకోవద్దని నాకు చాలా మంది చెబుతుంటారు.. కానీ కొన్నింటిని పట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పోస్ట్ పెట్టిన వాళ్ళకి కంగ్రాట్స్‌… నన్ను నొప్పించాలనుకున్న మీరు విజయవంతం అయ్యారు.? ” అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యింది..!

తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus