ట్రోల్స్ పై ఘాటుగా స్పందించిన కన్నడ బ్యూటీ

“రంగస్థలం” టైమ్ లో సమంతను “పెళ్లి తర్వాత రామ్ చరణ్ తో కిస్సింగ్ సీన్ చేయడం ఎలా అనిపించింది?” అని ప్రశ్నించగా.. ఇదే ప్రశ్న పెళ్ళైన హీరోలను ఎందుకు అడగరు? అని రివర్స్ లో క్వశ్చన్ చేసి అందరి నోళ్ళు మూయించింది. ఇప్పుడు ఆమె తరహాలోనే రష్మిక మండన్నా కూడా స్పందించింది. ఇటీవల రష్మిక “గీత గోవిందం” సినిమా నుంచి ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. అయితే.. ఆ పోస్టర్ ను ఉద్దేశించి కొందరు నెటిజన్లు కాస్త ఘాటుగా స్పందించారు. నీకు పెళ్లి సెట్ అయ్యింది అని మర్చిపోయావా? ఆ ఫోజులేంటి? అంటూ దారుణమైన కామెంట్స్ తో దాడి చేశారు.

రష్మిక కూడా అందరు హీరోయిన్లలాగే సైలెంట్ గా ఉంటుందేమో అనుకొన్నారందరూ. కట్ చేస్తే.. అమ్మడు కాస్త ఘాటుగా ప్రతిస్పందించింది. ఇదే విధంగా పెళ్ళైన హీరోల పోస్టర్స్ కి ఎందుకు కామెంట్ చేయరు? అని తిరుగు ప్రశ్నించీంది. దాంతో ఒక్కసారిగా అందరూ సైలెంట్ అయిపోయారు. రష్మికకు ఉన్న స్వీట్ గర్ల్ ఇమేజ్ ను పూర్తి స్థాయిలో మార్చేసే విధంగా “గీత గోవిందం” సినిమా ఉన్న విషయం తెలిసిందే కానీ.. ఈ సినిమా ఆమె యాటిట్యూడ్ ను కూడా మార్చేస్తుందని మాత్రం ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus