Rashmika Mandanna: దెయ్యాల కాంపౌండ్ లో రష్మీక.. ప్లాన్ ఏంటీ?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna).. ఇప్పుడు హారర్ కామెడీ జానర్ లోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించనున్న ఈ సినిమాలో రష్మిక ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా టైటిల్ ‘థామ’ అని, దినేష్ విజన్ హారర్ కామెడీ యూనివర్స్‌లో ఈ కొత్త కథ మరో ప్రధాన అంగంగా నిలవబోతోందని చిత్రబృందం తెలిపింది. 2025 దీపావళి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ‘థామ’ సినిమా గురించి రష్మిక తాను సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసి ఆసక్తికరమైన ప్రకటన చేసింది.

Rashmika Mandanna

ఈ సినిమా ప్రణాళిక చాలా కొత్తగా ఉందని, దురదృష్టవశాత్తూ రక్తపాతం కూడా ఉండబోతోందని చిత్ర బృందం తెలిపింది. దెయ్యాల కథలకు కాంపౌండ్ గా మారిన మడాక్ ఫిల్మ్స్ బ్యానర్ లో దినేష్ విజన్, అమర్ కౌశిక్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘ముంజ్య’ ఫేమ్ ఆదిత్య సర్పోత్థార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేశ్ రావల్ వంటి విలక్షణ నటులు కూడా ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.

తెలుగులో ‘పుష్ప’ (Pushpa)తో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక, ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా బిజీ అయ్యేలా అడుగులు వేస్తోంది. తాజాగా ఆమె ‘యానిమల్’ (Animal) చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు రష్మిక ‘థామ’తో తన మొదటి హారర్ కామెడీ మూవీ చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక రష్మిక ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు.

పుష్ప 2, సికిందర్ (Sikandar) వంటి సినిమాలు కూడా ఆమె చేతిలో ఉండగా, విక్కీ కౌశల్ (Vicky Kaushal) తో ఛత్రపతి శివాజీ కుమారుడి పాత్ర ఆధారంగా రూపొందిన ‘ఛావా’ (Chhaava) మూవీలో కూడా నటిస్తున్నారు. అలాగే త్రిభాషా చిత్రం కుబేరలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. మొత్తానికి ‘థామ’ మూవీతో హారర్ కామెడీ లో నటించే అవకాశం అందుకున్న రష్మిక.. సినిమాలో నవ్విస్తూ ప్రేక్షకులను భయపెడుతుందేమో చూడాలి.

లారెన్స్ సినిమాకి 200 కోట్లా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus