హిందీలో మన డామినేషన్.. ఏ రేంజ్ లో ఉందంటే..!

తెలుగు సినిమా ఓ సుదీర్ఘ ప్రయాణం చేసింది. ఒకప్పుడు సౌత్ సినిమా అనేది నార్త్ ఇండియాలో పెద్దగా కనిపించేది కాదు. ఓ చిన్నచూపు కూడా ఉండేది. కానీ బాహుబలి, కేజీఎఫ్ వంటి చిత్రాలు వచ్చాక బాలీవుడ్ మార్కెట్ లో తెలుగు సినిమాల దశాబ్దాల కృషికి ఫలితాలు రావడం మొదలైంది. ఇప్పుడు హిందీ సినిమా పరిశ్రమ సౌత్ డబ్బింగ్ సినిమాలే తమ బాక్సాఫీస్ రెవెన్యూ కోసం ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

2024లో భారతీయ బాక్సాఫీస్ గ్రాస్ రూ.12,000 కోట్లకు చేరుకుంది. ఇందులో సౌత్ డబ్బింగ్ సినిమాలు 31 శాతం వాటా సంపాదించడం విశేషం. పుష్ప 2 ఒక్క హిందీ వెర్షన్ ద్వారానే రూ.889 కోట్లు గ్రాస్ అందుకుంది. ఈ స్థాయిలో బాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలపై పోటీ పడటం టాలీవుడ్ సాధించిన విజయాన్ని తెలుపుతుంది. బాలీవుడ్ స్ట్రెయిట్ చిత్రాలు 37 శాతం గ్రాస్ కోల్పోయాయి. కానీ తెలుగు సినిమాలు 20 శాతం వృద్ధితో నిలబడటం మరో ప్రత్యేకత.

సౌత్ సినిమాల సక్సెస్ వల్ల బాలీవుడ్ మార్కెట్ తారస పడుతున్న సంక్షోభం మరింత స్పష్టమవుతోంది. గేమ్ ఛేంజర్ మిక్స్డ్ టాక్ వచ్చినా, హిందీలో మంచి వసూళ్లు సాధించగలగడం మన సినిమాల ప్రభావాన్ని చూపించింది. ఈసారి హరిహర వీరమల్లు, ది రాజా సాబ్ వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులు బాలీవుడ్ ని మరింతగా ఆకర్షించనున్నాయి. ఈ ప్రాజెక్టులతో పాటు కల్కి 2898 ఏడి 2, విశ్వంభర వంటి చిత్రాలు టాలీవుడ్ స్థాయిని మరో లెవెల్ కి తీసుకెళ్తాయని విశ్లేషకుల అంచనా.

ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ కంటే ముందే ఉన్నట్లు స్పష్టమవుతోంది. మునుపటిలా కేవలం తెలుగుతోనే కాకుండా హిందీ, తమిళ, మలయాళ మార్కెట్లను కూడా ఆకట్టుకుంటూ టాలీవుడ్ సత్తా చాటుతోంది. భవిష్యత్తులో భారతీయ సినిమా పరిశ్రమలో టాలీవుడ్ తనదైన ప్రాధాన్యతను అందుకోవడం ఖాయం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వీరమల్లు వల్లే వెండితెరకు గ్యాప్.. ఇస్మార్ట్ బ్యూటీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus