పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న “హరి హర వీరమల్లు” సినిమా కారణంగా తన కెరీర్‌లో చాలా గ్యాప్ వచ్చిందని ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇటీవల చెప్పుకొచ్చింది. లాక్‌డౌన్ తర్వాత పవన్ పొలిటికల్ క్యాంపెయిన్ కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో షూటింగ్ హోల్డ్ లో పడింది. ఎందుకంటే ఆ సినిమా ఫినిష్ అయ్యే వరకు మరో సినిమా చేయకూడదని అగ్రిమెంట్ చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారో తెలియదు. కాబట్టి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అని ఈ సినిమాకు ఆ విధమైన నిర్ణయంతో ఉండాల్సి వచ్చింది. నాకు చాలా మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ, ఆ ప్రాజెక్ట్‌లోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నానని వెల్లడించింది. ఇక “మంచి టైమ్ వచ్చే వరకు నిరీక్షించడం తప్ప నాకు ఎలాంటి మార్గం కనిపించలేదు” అంటూ తాను ఎదుర్కొన్న సవాళ్లను స్పష్టం చేసింది.
తన కెరీర్‌లో వచ్చిన గ్యాప్ కారణంగా చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయని పేర్కొంది. నిజాయితీగా చెప్పాలంటే, ఎవరో నా ప్లేస్ తీసుకున్నారని అనిపించి క్షణాల్లో మైండ్‌శేట్ మార్చుకున్నాను. అలాంటి సందర్భాల్లో నాకు టైమ్, డెస్టినీ, దేవుడు అన్నీ నమ్మకం ఉన్నాయని గుర్తుచేసుకున్నాను.. అని చెప్పింది. తనకు ఎదురైన సవాళ్లను గమనిస్తే, టైమ్ అనేది ఎంత ముఖ్యమో అర్థమవుతుందని అభిప్రాయపడింది.
ఈ గ్యాప్ సమయంలో తాను ఎన్నో ఆఫర్లను వదులుకోవాల్సి వచ్చిందని, కొన్ని చేసినా, చాలా చేయలేకపోయానని చెప్పింది. “నా మనసు ‘హరి హర వీరమల్లు’ మీదే ఉన్నప్పుడు, ఇతర ప్రాజెక్టులు చేయడం అసాధ్యమయ్యింది” అని పేర్కొంది. అలాగే, తన జీవన విధానాన్ని ప్రోత్సహించడానికి బ్రాండ్ ప్రమోషన్స్, యాడ్స్, సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదించానని స్పష్టం చేసింది. ఇన్ని ఇబ్బందుల తర్వాత ఈ సినిమా తనకు సరైన టైమ్‌ను తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. తనకు ఎదురైన ప్రతీ సమస్యను ఎదుర్కొని ముందుకు సాగడం నేర్చుకున్నానని, సినిమా విడుదలైన తర్వాత ఆ గ్యాప్ పూర్తిగా నిండిపోతుందని నమ్మకం వ్యక్తం చేసింది.