Raghava Lawrence: లారెన్స్ సినిమాకి 200 కోట్లా?

వైవిధ్యమైన కథలు, వినూత్నమైన పాత్రలతో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కనబరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రాఘవ లారెన్స్ (Raghava Lawrence) , ఇప్పుడు తన 25వ చిత్రంలో సరికొత్త అవతారం ఎత్తనున్నారు. లారెన్స్ సూపర్ హీరో పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమా పేరు ‘కాల భైరవ.’ ఇది ఓ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం. ఈ సినిమాను ఏ స్టూడియోస్ ఎల్ఎల్‌పి, గోల్డ్ మైన్ టెలీ ఫిల్మ్స్‌, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్లలో కోనేరు సత్యనారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Raghava Lawrence

ఖిలాడి (Khiladi) డైరెక్టర్ రమేష్ వర్మ  (Ramesh Varma)  దర్శకత్వంలో లారెన్స్‌ ఈ సరికొత్త ప్రయోగంలో నూతన కోణాన్ని పరిచయం చేయబోతున్నారని మేకర్స్ తెలిపారు. ఇక దర్శకుడు రమేష్ వర్మ కథ పరంగా కొత్తధనం చూపిస్తున్నప్పటికి మేకింగ్ విషయంలో అతను ఫెయిల్ అవుతున్నాడనే కామెంట్ ఉంది. ఖిలాడి కంటే ముందు రాక్షసుడు తో ఒక హిట్ అందుకున్నాడు. అది కూడా రీమేక్ సినిమా. అయినప్పటికీ ఇప్పుడు అతనిని నమ్మి ఏకంగా 200 కోట్లు ఖర్చు చేస్తుండడం షాకింగ్ విషయం.

లారెన్స్ కూడా ఇప్పటివరకు ఆ రెంజ్ హిట్ అయితే చూడలేదు. అసలైతే ఈ ఇద్దరు కిల్ రీమేక్ చేయనున్నట్లు టాక్ వచ్చింది. కానీ అప్డేట్ వచ్చిన అనంతరం రీమేక్ కాదనే క్లారిటీ వచ్చేసింది. ఇక ‘ది వరల్డ్ విత్ ఇన్’ అనే స్లోగన్‌తో విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌ ప్రేక్షకుల్లో కొంత ఆసక్తిని రేకెత్తించింది. ఫస్ట్ లుక్‌లో లారెన్స్ కనిపించే పవర్‌ఫుల్ లుక్, కఠినత్వం చూసిన ప్రేక్షకులు సూపర్ హీరోగా అతనికి ఎంతో అర్హత ఉందని ప్రశంసిస్తున్నారు.

ఇక సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. సూపర్ హీరోగా లారెన్స్ సరికొత్త పాత్రలో కనిపించనుండడంతో అభిమానులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతున్న ఈ సినిమా 2025 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు విన్నూత్న అనుభవం అందించేందుకు మేకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

జక్కన్న తిరుగుడు చూస్తుంటే.. బాబుకు చుక్కలే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus