Rashmika: రష్మిక కెరీర్‌లో కీలక సమయం… ఇక్కడ పాస్‌ అయితే టాపర్‌ పక్కా!

తెలుగులో వరుస విజయాలు అందుకుంటున్న సమయంలోనే బాలీవుడ్‌ ఫ్లయిట్‌ ఎక్కేసి కాస్త కంగారు పెట్టింది రష్మిక మందన. ఎందుకంటే అలా మధ్యలో కెరీర్‌ వదిలేసి వెళ్లిపోయిన హీరోయిన్లకు అక్కడా, ఇక్కడా ఆ తర్వాత మార్కెట్‌ రాలేదు. కానీ రష్మిక (Rashmika Mandanna) ఆ ట్రెండ్‌ను దాటేసింది. రెండు దగ్గర్లా సినిమాలు చేస్తోంది, విజయాలు సాధిస్తోంది, పేరూ తెచ్చుకుంటోంది. అయితే బాలీవుడ్‌లో ఆమె కెరీర్‌ పరిస్థితిని తేల్చే సినిమా విడుదలకు సిద్ధమైంది. అదే ‘ఛావా’ (Chhaava).

Rashmika

తనను ఎందుకు నేషనల్‌ క్రష్‌ అని పిలుస్తారో ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) సినిమాతో మరోసారి నిరూపించింది రష్మిక మందన. ఇప్పుడు మరోసారి పాన్‌ ఇండియాలో స్థాయిలో అదరగొట్టడానికి రెడీ అవుతోంది. విక్కీ కౌశల్‌ (Vicky Kaushal) ప్రధాన పాత్రలో రూపొందుతున్న హిస్టారికల్‌ డ్రామా సినిమా ‘ఛావా’. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇందులో శంభాజీ భార్య ఏసు బాయిగా రష్మిక కనిపించనుంది.

ఆమె పాత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేసింది. ‘ప్రతి రాజు వెనక ఓ శక్తిమంతమైన రాణి ఉంటుంది. స్వరాజ్యం గర్వించదగిన మహారాణి ఏసుబాయి’’ అని ఆ పోస్టర్‌తోపాటు పోస్టులో రాసుకొచ్చారు. రాచరికం ఉట్టిపడుతున్నా పోస్టర్‌లో రష్మిక (Rashmika) చాలా బాగుంది. కమర్షియల్‌ పాత్రలతో ఇన్నాళ్లూ అదరగొట్టిన ఆమె.. ఈ లుక్‌లో ఎలా చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. సినిమాలో ఆమె నటనతో అదరగొడితే ఇక ఆమెకు అక్కడ ఎదురే ఉండదు అని అంటున్నారు.

మొఘల్ సామ్రాజ్యం మీద మరాఠా యోధుడు శంభాజీ చేసిన యుద్ధం నేపథ్యంలో ‘ఛావా’ సినిమా తెరకెక్కింది. మరి ఈ యుద్ధం ఎలాంటి ఫలితం ఇస్తుందో తేలాలంటే సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేంవతరకు వెయిట్‌ చేయాలి. నిజానికి సినిమాను డిసెంబర్ 6న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ‘పుష్ప: ది రూల్‌’తో క్లాష్ అవుతుందని వాయిదా వేశారు. ఒకవేళ రిలీజ్‌ చేసి ఉంటే ఆ తుపానులో నిలిచేదే లేదో.

‘మాటే వినదుగా’ పాట గురించి షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన లిరిసిస్ట్ కెకె!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus