లిరిసిస్ట్ కృష్ణ కాంత్ (Krishna Kanth) అలియాస్ కెకె అందరికీ సుపరిచితమే. ‘అందాల రాక్షసి’ (Andala Rakshasi) లో ‘వెన్నంటే ఉంటున్నా’ అనే పాటతో పాపులర్ అయిన ఇతను ఆ తర్వాత ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ (Krishna Gaadi Veera Prema Gaadha) ‘పడి పడి లేచె మనసు’ (Padi Padi Leche Manasu) ‘సీతా రామం’ (Sita Ramam) వంటి హిట్ సినిమాలకి పాటలు రాశాడు. ఇతను రాసిన హిట్ సాంగ్స్ లో ‘మాటే వినదుగా’ ఒకటి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆ పాట గురించి అతను షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.
‘మీరు ఇప్పటివరకు ఫాస్ట్ గా రాసిన సాంగ్ ఏంటి? ఏ డైరెక్టర్ కి ఫాస్ట్ గా పాట రాసి ఇవ్వగలిగారు?’ అంటూ.. యాంకర్ ప్రశ్నించగా.. అందుకు కెకె.. ” దర్శకుడు రాహుల్ కి (Rahul Sankrityan) ‘మాటే వినదుగా’ అనే పాటని గంటలో రాసి ఇచ్చాను. వాస్తవానికి అది కార్ గురించి రాసిన పాట. కానీ అది అందరికీ లవ్ సాంగ్ అనిపిస్తుంది. ‘ఆ వైపర్ తుడిచే కారే కన్నీరే’ అనే లిరిక్ ఉంటే.. అందరూ ‘వైఖరి తుడిచే కారే కన్నీరే’ అని అనుకున్నారు.
ఆ కార్లో ఓ స్పిరిట్ ఉంటుంది. అది హీరో అండ్ కార్ కి మధ్య వచ్చే లవ్ సాంగ్. అయితే అందరూ అది హీరోయిన్ తో లవ్ సాంగ్ అనుకున్నారు. ఆ కార్.. హీరో మాట వినదు. లిరిక్స్ అలా ఉంటాయి” అంటూ క్లారిటీ ఇచ్చాడు. నిజంగా ‘మాటే వినదుగా’ అనేది లవ్ సాంగ్ మాదిరి అనిపిస్తుంది. కానీ అది సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన విధానం, దర్శకుడు పిక్చరైజ్ చేసిన విధానం.. అన్ని లవ్ సాంగ్ ఫీలింగ్ ఇచ్చాయి.