వైరల్ : రష్మిక మందన పేరుని ఇలా మార్చేశారేంటి..!

రష్మిక మందన ఇప్పుడు నేషనల్ క్రష్ అన్న సంగతి తెలిసిందే. అందుకే ఆమెను చాలా మంది ప్రేక్షకులు ‘క్రష్ మిక’ అంటున్నారు. దానిని ఆధారం చేసుకుని ఇప్పుడు ఆమె పేరు మారిపోయింది అని చెప్పడం లేదు. ఆమె తాజా చిత్రం ‘పుష్ప ది రైజ్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘బాహుబలి’ ‘కె.జి.ఎఫ్’ ల తర్వాత పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించిన చిత్రమిది. ‘పుష్ప ది రైజ్’ విడుదలై 3 వారాలు పూర్తికావస్తోన్నప్పటికీ ఇంకా థియేటర్లలో డీసెంట్ కలెక్షన్లను రాబడుతోంది.

అయితే ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం.. ‘పుష్ప’ చిత్రాన్ని 3 వారాలకే ఓటిటిలో విడుదల చేశారు. నిన్న రాత్రి అనగా జనవరి 7న రాత్రి 8 గంటలకి ‘పుష్ప’ ని అమెజాన్ ప్రైమ్లో విడుదల చేశారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ‘పుష్ప’ ని థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులందరూ ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి.

ఈ చర్చల్లో ‘పుష్ప’ లో ఓ తప్పు కూడా ఉండడాన్ని మన నెటిజన్లు గమనించారు.అదేంటంటే… సినిమా పూర్తయ్యాక ఎండింగ్ టైటిల్స్ లో హీరోయిన్ పేరు రష్మిక మందనకి బదులుగా రష్మిక మడోనాగా పడింది. దీంతో నెటిజన్లు అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేస్తూ పెద్ద ఎత్తున ఈ టాపిక్ ను వైరల్ చేస్తున్నారు. ‘పుష్ప’ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ హడావిడి హడావిడిగా జరిగాయి.

హిందీ ఫైనల్ కాపీ అయితే ఒక్క రోజు ముందు విడుదల చేశారు. డిసెంబర్ 17న అంటే ఈ చిత్రం విడుదల రోజున మలయాళం వెర్షన్ విడుదల కాలేదు. కాబట్టి ఇలాంటి చిన్నా చితకా తప్పులు జరిగుండొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ సినిమాని థియేటర్లలోకి తీసుకురావడమే పెద్ద టాస్క్ అయిపోయింది మేకర్స్ కి..!

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus