సూపర్ స్టార్ తో రొమాన్స్ చేసే సూపర్ ఛాన్స్ సొంతం చేసుకొన్న రష్మిక!

“ఛలో” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక అనంతరం “గీత గోవిందం, దేవదాస్” లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోయింది. ఈ మూడు సినిమాలతో రష్మిక స్టార్ హీరోయిన్ స్థాయికి ఎగబాకింది. ఇప్పుడు ఈ అమ్మడికి అస్సలు ఎక్స్ పెక్ట్ చేయను బంపర్ ఆఫర్ వచ్చిందని ఫిలిమ్ నగర్ టాక్. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో జతకట్టబోతున్నట్టు సమాచారమ్. ప్రస్తుతం మహేష్ “మహర్షి”తో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.

ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తన 26వ సినిమా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. ఈ సినిమా కోసం హీరోయిన్స్ గా కైరా అద్వానీ, రష్మిక మందన పేర్లు వినిపిస్తున్నాయి. “భరత్ అను నేను” సినిమాలో మహేష్ తో జతకట్టింది కైరా. ఈ నేపథ్యంలో మహేష్ పక్కన కొత్త ఫేస్ కావాలని భావిస్తే ఆ అవకాశం రష్మికకి దక్కొచ్చు. ఇదే జరిగితే ఆమె స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయినట్టే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus