నాగ్, నాని మల్టీ స్టారర్ మూవీలో కన్నడ బ్యూటీలు

ప్రస్తుతం నాని యువ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా చేస్తున్నారు. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. కింగ్ నాగార్జున కూడా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆఫీసర్ సినిమాని కంప్లీట్ చేశారు. ఇక రేపటి నుంచి ఇద్దరూ శ్రీరామ్ ఆదిత్య డైరెక్ష‌న్‌లో నటించనున్నారు. ఆసక్తి కలిగిస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీ రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇందులో నాని డాక్టర్ గా కనిపించనుండగా, నాగ్ డాన్ పాత్రలో నటించనున్నారు. ఇక వీరి పక్కన హీరోయిన్స్ గా లావణ్య త్రిపాఠి, శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయికలుగా నటించనున్నారని గతంలో వార్తలు షికారు చేశాయి.

ఈ వార్తలో సగం నిజం.. సగం అబద్ధం ఉందని తెలిసింది. నాగ్ సరసన కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ ఫిక్స్ అయిన మాట నిజం. నాని పక్కన లావణ్య నటించడం అబద్ధం. నాని పక్కన కూడా కన్నడ బ్యూటీనే ఓకే చేసినట్లు సమాచారం. కన్నడలో కిరిక్ పార్టీ తో పాపులర్ అయినా రష్మిక తెలుగులోనూ చలో మూవీతో విజయాన్ని అందుకుంది. ఆమెనే నానికి జోడీగా తీసుకున్నట్టు టాక్. రేపు సినిమా షూటింగ్ ప్రారంభం సందర్భంగా ఈ వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus