Rashmika: హాట్ టాపిక్ గా మారిన రక్షిత్ శెట్టి- రష్మిక ల చాట్..!

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న..తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. ‘ఛలో’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తరువాత ‘గీత గోవిందం’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బస్టర్లను అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ప్రస్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్- సుకుమార్ ల ‘పుష్ప’ చిత్రంలో నటిస్తుంది. అలాగే ఆమె హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం ‘సుల్తాన్’ అదే పేరుతో ఈ మధ్యనే తెలుగులో డబ్ అయిన సంగతి తెలిసిందే.

ఇది కూడా పర్వాలేదు అనిపించింది.కన్నడ, తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా బిజీ హీరోయిన్ గా రాణిస్తోంది రష్మిక.బాలీవుడ్లో ఆమె మిషన్ మజ్ను అనే చిత్రంలో నటిస్తుంది. ఇదిలా ఉండగా..ఏప్రిల్ 5న(నిన్న) రష్మిక పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే.ఆమె అభిమానులు సోషల్ మీడియాలో విషెస్ చెబుతూ ఆమె బర్త్ డే ట్యాగ్ ను పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. మరోపక్క ఆమె మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి కూడా ఈమెకు విషెస్ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. బర్త్ డే కి విషెస్ చెప్పడంలో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు.

అయితే ఇతను స్పెషల్ గా ఓ వీడియో ద్వారా విషెస్ చెప్పడంతో ఇది వైరల్ అవుతుంది. ఆ వీడియోని రక్షిత్ శెట్టి షేర్ చేస్తూ.. “నీ ‘కిరిక్ పార్టీ’ ఆడిషన్ కి సంబంధించిన ఓ అందమైన అనుభవం ఇది. అప్పటి నుండీ నువ్వు చాలా ఎదిగావు. నీ డ్రీమ్స్ ఫుల్ ఫిల్ చేసుకునేందుకు ఓ వారియర్ లా పోరాడుతున్నావ్. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. హ్యాపీ బర్త్ డే టూ యూ’ అంటూ పేర్కొన్నాడు. ఈ ట్వీట్ పై రష్మిక స్పందిస్తూ… ‘నిజమే.. నేను ఇంకా ఆ సందర్భాన్ని మర్చిపోలేదు. రక్షిత్… థాంక్యూ.. ఇది ఎంతో విలువైంది’ అంటూ చెప్పుకొచ్చింది.


Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus