Rashmika: టాలీవుడ్ డైరెక్టర్లకు మాత్రమే ఆ కండిషన్ పెడుతున్న రష్మిక!

సాధారణంగా సినిమాలలో నటించే సెలబ్రిటీలు వారి సినిమాల విషయంలో దర్శక నిర్మాతలకు కొన్ని కండిషన్స్ పెడుతూ ఉంటారు. అయితే నటి రష్మిక మందన్న సైతం దర్శక నిర్మాతలకు తన ప్రతి టాలీవుడ్ సినిమాకు ఒకే కండిషన్ పెడతారట అయితే ఈమె ఈ కండిషన్ కేవలం తెలుగు సినిమాలకు మాత్రమేనని బాలీవుడ్ సినిమాలకు పెట్టరని తెలుస్తోంది. మరి తెలుగు సినిమాలకు రష్మిక పెట్టే ఆ కండిషన్ ఏంటి అనే విషయానికి వస్తే…

బాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకులు ఈ తేదీ సినిమా షూటింగ్ ఉంది అంటే కచ్చితంగా ఆ సినిమా ఆరోజు షూటింగ్ జరుగుతూ ఉంటుందట అందుకోసమే ఈమె బాలీవుడ్ డైరెక్టర్లకు ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా వారికి కాల్ షీట్స్ ఇచ్చేస్తారట కానీ తెలుగు హీరోలు మాత్రం అలా కాదు ఈరోజు షూటింగ్ ఉంది అంటే ఆ రోజు కాకుండా ఎప్పుడో పది రోజులకు ఆ సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తారట.

ఇలా కాల్ షీట్స్ ఒక రోజు తీసుకొని షూటింగ్ ఒక రోజు చేయటం వల్ల తన సినిమాలకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో రష్మిక సినిమాకు కమిట్ అయ్యేముందు నేను ఈరోజు మాత్రమే కాల్షీట్ ఇవ్వగలను అని దర్శకులతో ఈ విషయం గురించి క్లారిటీగా మాట్లాడిన తర్వాతనే సినిమాలకు కమిట్ అవుతుందని తెలుస్తుంది. అయితే కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే ఈమె ఇలాంటి కండిషన్స్ పెడతారట.

ఇక తాను ఆ సినిమా కోసం ఎప్పుడైతే కాల్ షీట్స్ ఇచ్చిందో ఆరోజు తప్పనిసరిగా సినిమా షూటింగ్ కి హాజరవుతుందని, అందుకే దర్శకులు ఈమె పాత్రకు సంబంధించి షూటింగ్ మాత్రం అసలు పోస్ట్ ఫోన్ చేయరని తెలుస్తోంది. ఇలా సినిమాలకు ముందు కాల్ షీట్స్ అన్ని ఫిక్స్ చేసుకున్న తర్వాతనే ఈమె రెమ్యూనరేషన్ గురించి కూడా మాట్లాడి అడ్వాన్స్ తీసుకుంటారని తెలుస్తోంది. ఇలా ప్రతి ఒక్క సినిమా విషయంలోను రష్మిక ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఇలా రష్మిక (Rashmika) పెట్టే కండిషన్ గురించి తెలియడంతో పలువురు ఈ విషయంపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. రష్మికకు టాలీవుడ్ దర్శకుడు అంటే ఎంత నమ్మకమో అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు పరోక్షంగా ఈమె టాలీవుడ్ డైరెక్టర్లకు క్రమశిక్షణ లేదని చెబుతున్నారా అంటూ ఈ విషయంపై కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమా యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇక తెలుగులో పుష్ప సినిమా షూటింగ్ పనులలో రష్మిక బిజీగా ఉన్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus