Rashmika: మరోసారి డీప్ ఫేక్ వీడియో పై స్పందించిన రష్మిక!

  • February 1, 2024 / 05:37 PM IST

నేషనల్ క్రష్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రష్మిక మందన్న ఒకరు. ఈమె భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రష్మిక మరోసారి డీప్ ఫేక్ వీడియో గురించి మాట్లాడారు. రష్మిక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఈ వీడియో పై ఎంతోమంది సెలబ్రిటీలు స్పందించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఇందుకు కారణం అయినటువంటి వారిని అదుపులోకి కూడా తీసుకున్నారు.

ఇక తాజాగా రష్మిక ఈ విషయం గురించి మాట్లాడుతూ నేను డీప్ ఫేక్ వీడియో గురించి మాట్లాడటానికి కారణం ఉందని తెలిపారు. ఇలాంటి చేదు అనుభవం నాకు కాలేజీ రోజుల్లో కనుక ఎదురైతే ఎవరూ కూడా నాకు మద్దతు తెలిపేవారు కాదని ఈమె తెలిపారు. దీని గురించి మాట్లాడితే ఎవరేమనుకుంటారు అని ఆలోచించాను. ఒకవేళ మాట్లాడితే తన ఫాలోవర్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా అనుకుంటారని రష్మిక తెలిపారు.

అయితే వాటన్నింటినీ ఆలోచించకుండా ఇలాంటి విషయాల గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరికి అవగాహన వస్తుందన్న కారణంతోనే నేను డీప్ ఫేక్ వీడియో పై స్పందించానని తెలిపారు. కాలేజీ చదివే అమ్మాయిలకు కనుక ఇలాంటి అనుభవం ఎదురైతే పరిస్థితి ఏంటని భయపడ్డాను. ఇలా అమ్మాయిలలో ధైర్యం నింపడం కోసమే తాను ఈ వీడియో పై స్పందించానని ఈ సందర్భంగా రష్మిక (Rashmika) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus