మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన రష్మిక?

  • February 21, 2020 / 06:17 PM IST

ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2021 జనవరి 8న ఈ చిత్రం విడుదల కాబోతుంది. దానికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా చేశారు నిర్మాతలు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ తన తరువాతి చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయబోతున్నట్టు కూడా ఇటీవల ప్రకటించారు. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ మరియు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్స్ పై.. చినబాబు, కళ్యాణ్ రామ్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ను ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా మరోసారి పూజా హెగ్దే ను ఎంపిక చేయబోతున్నట్టు టాక్ నడిచింది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అరవింద సమేత’ ‘అల వైకుంఠపురములో’ చిత్రాల్లో పూజా హెగ్దే హీరోయిన్ గా చేసింది కాబట్టి.. అందులోనూ ఆ చిత్రాలు హిట్టయ్యాయి కాబట్టి ఈసారి కూడా కలిసొస్తుందని అనుకున్నారట. అయితే త్రివిక్రమ్ మనసులో రష్మికను తీసుకుందాం అనే ఆలోచన ఉందట. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన రష్మిక.. ఇప్పుడు ‘భీష్మ’ చిత్రంతో మరో హిట్టుని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు సుకుమార్, బన్నీ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus