Rashmika: గీతాఆర్ట్స్ లో రష్మిక సినిమా.. ఆగిపోయినట్లే!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది రష్మిక. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ దక్కించుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం సౌత్ తో పాటు బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటిస్తోంది. రణబీర్ లాంటి హీరోలతో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇదిలా ఉండగా.. రష్మికతో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని ప్లాన్ చేసింది గీతాఆర్ట్స్ సంస్థ. గీతాఆర్ట్స్ 2 చేతిలో రష్మిక డేట్లు ఉన్నాయి. ఆమెతో సినిమా చేయాలనుకున్నాడు బన్నీ వాస్.

రాహుల్ రవీంద్రన్ ను దర్శకుడిగా అనుకున్నారు. ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారాడు రాహుల్ రవీంద్రన్. మొదటి సినిమా సక్సెస్ అయినప్పటికీ.. రెండో సినిమా ‘మన్మథుడు 2’తో డిజాస్టర్ అయింది. దీంతో అతడి నుంచి మరో సినిమా రాలేదు. చాలా రోజుల తరువాత రష్మిక ప్రధాన పాత్రలో రాహుల్ సినిమా మొదలుపెట్టినట్లు వార్తలొచ్చాయి. తాను రాసుకున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలో ముందుగా సమంతను హీరోయిన్ గా అనుకున్నారు.

కానీ ఫైనల్ గా రష్మిక చేతులోకి ప్రాజెక్ట్ వచ్చింది. స్క్రిప్ట్ హీనులు కూడా మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు సమాచారం. కొన్ని ఈక్వేషన్స్ కుదరకపోవడంతో రష్మిక సినిమాను గీతాఆర్ట్స్ 2 పక్కన పెట్టిందని తెలుస్తోంది. మరి ఈ కథను మరో బ్యానర్ లో తీస్తారా..? లేక పూర్తిగా పక్కన పెట్టేశారా..? అనే విషయంలో క్లారిటీ లేదు. సినిమా ఇండస్ట్రీలో ఇలా అనుకున్న సినిమాలు హోల్డ్ లో పడడం కామనే.

నిర్మాతలకు బడ్జెట్ ఎక్కువ అవుతుందని అనిపించినా.. కథ మీద డౌట్ ఉన్నా.. ప్రాజెక్ట్ లను పక్కన పెట్టేస్తారు. మరి రాహుల్ విషయంలో ఏం జరిగిందనేది మాత్రం బయటకు తెలియడం లేదు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus