తాను చేసిన తప్పుకి బాధపడుతోన్న రాశీ ఖన్నా

ప్రస్తుతం “అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. బోల్తా పడిందిలే బుల్ బుల్ పిట్టా..” అనే పాట రాశీ ఖన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ గా వినిపిస్తోంది. ఎందుకంటే ఆమె చేసిన చిన్న తప్పు అవకాశాలను తన్నుకుపోయింది. ఇప్పుడు ఏమి చేయాలో తెలియక తలపట్టుకుంది. వివరాల్లోకి వెళితే… శతమానం భవతి మూవీ తర్వాత సతీష్ వేగేశ్న తెరకెక్కించిన సినిమా శ్రీనివాస కల్యాణం. ఇందులో హీరోయిన్ గా రాశీ ఖన్నా నటించింది. ఈ సినిమా సమయంలోనే పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందంలో హీరోయిన్ గా నటించమని అడిగారు.

అయితే వీరిద్దరిలో కోటి రూపాయల ఎవరు ఇస్తారో.. వారికే సైన్ చేస్తానని చెప్పింది. దిల్ రాజు కోటి ఇవ్వడంతో శ్రీనివాస్ కళ్యాణం చేసింది. ఈ రెండు సినిమాలు కొన్ని రోజుల తేడాలో రిలీజ్ అయ్యాయి. శ్రీనివాస కళ్యాణం బడ్జెట్ కూడా రాబట్టలేకపోయింది. గీత గోవిందం మాత్రం సామాన్యులతో పాటు సెలబ్రిటీల మనసును గెలుచుకుంది. వందకోట్ల కలక్షన్స్ కొల్లగొట్టి దూసుకుపోయింది. ఇందులో హీరోయిన్ గా నటించిన రష్మికకు అవకాశాలు వెల్లువెత్తాయి. రాశీఖన్నాకు ఉన్న అవకాశాలు సైతం చెయ్యి జారిపోయాయి. దీంతో రాశీఖన్నా కోటికి ఆశపడి అవకాశాలు పోగొట్టుకుందని సినీ ప్రముఖులు అంటున్నారు. ఆమె కూడా అదే తలుచుకొని బాధపడుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus