బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం 2వారాల ఇమ్యూనిటీ కోసం హౌస్ మేట్స్ తెగ తాపత్రయ పడిపోతున్నారు. దీనికోసం కంటెండర్స్ గా శుభశ్రీ, పల్లవి ప్రశాంత్ ఇంకా ప్రిన్స్ యావర్ లు పోటీ పడ్డారు. ఇందులో పల్లవి ప్రసాంత్ బ్యాలన్సింగ్ గేమ్ లో గెలిచి ఈ ఇమ్యూనిటీ ని దక్కించుకున్నాడు. అంతేకాదు పవర్ అస్త్రాతో కన్పార్మ్స కంటెస్టెంట్ కూడా అయ్యాడు. దీంతో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.
అన్ అఫీిషియల్ పోలింగ్స్ ప్రకారం ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి. ఈవారం డేంజర్ జోన్ లో ఎవరున్నారు అనేది ఒక్కసారి చూసినట్లయితే, ప్రిన్స్ యావార్ కి మంచి ఓటింగ్ జరుగుతోంది. ఆల్ మోస్ట్ 28పర్సెంట్ వరకూ ఓటింగ్ ని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రియాంకకి కూడా మంచి ఓటింగ్ జరిగింది. తను కూడా 22శాతం ఓటింగ్ తో సేఫ్ జోన్ లో ఉంది. ఇక మూడో ప్లేస్ లో గౌతమ్ ఉన్నాడు. గౌతమ్ కి 18పర్సెంట్ ఓటింగ్ అనేది జరుగుతోంది.
చాలా సైట్స్ లో అయితే గౌతమ్ టాప్ లో కూడా ఉన్నాడు. ఈ ముగ్గురు అయితే ఖచ్చితంగా సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక టేస్టీ తేజ , రతిక ఇంకా శుభశ్రీ ఈ ముగ్గురే డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ అనేది జరగబోతోంది. ముఖ్యంగా టేస్టీ తేజ చాలా వరకూ వెనకబడ్డాడు. అయితే, ఈవారం బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) డబుల్ ఎలిమినేషన్ చేస్తే మాత్రం రతిక కూడా అవుట్ అయ్యే అవకాశమే కనిపిస్తోంది.
అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో చాలా సైట్స్ లో రతిక బోటమ్ లో ఉంది. కానీ, టేస్టీ తేజకి రెండు ముడు రోజులు సరిగ్గా ఓటింగ్ అనేది జరగలేదు కాబట్టి ఈవారం టేస్టీ తేజ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే, రతిక కూడా ఎలిమినేట్ అయ్యా ఛాన్స్ ఉంది. మరి వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం. ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం చూస్తే శుభశ్రీ వీళ్లిద్దరి కంటే కూడా కొంచెం బెటర్ ఓటింగ్ లోనే ఉంది.
12 పర్సెంట్ వరకూ శుభశ్రీ కి ఓటింగ్ జరిగింది. ఇక మిగిలిన 20 పర్సెంట్ మాత్రే టేస్టీ తేజ ఇంకా రతిక లు పంచుకున్నారు. కాబట్టి ఇద్దరిలో ఎవరైనా సరే వెళ్లిపోయే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే రతిక ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదీ మేటర్.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !