Bigg Boss 7 Telugu: సండే ఎపిసోడ్ లో మాస్టర్ ప్లాన్..! అసలు మేటర్ ఏంటంటే.?

బిగ్ బాస్ హౌస్ లో సండే ఎపిసోడ్ అంటేనే ఫన్ డే ఎపిసోడ్. అయితే, ఈరోజు ఎలిమినేషన్ కూడా ఉంటుంది కాబట్టి, హౌస్ మేట్స్ లో ఉత్కంఠ ఉంటుంది. అనుకున్నట్లుగానే ఈవారం సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయిపోయారు. శోభాశెట్టి, తేజ, ప్రియాంక, ఆఖరికి యావర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిజానికి ఈవారం మాస్టర్ ని నామినేట్ చేసింది యావర్ అండ్ తేజ. తేజ దానికోసం చాలా ఫీల్ అయ్యాడు. మాస్టర్ కి సారీ చెప్పాడు. ఇక నామినేషన్స్ లోకి వచ్చిన ఫస్ట్ వారమే మాస్టర్ ఎలిమినేట్ అయిపోయాడు. సండే ఎపిసోడ్ బ్రేక్ టైమ్ లో యావర్ కి – రతికకి గట్టి ఆర్గ్యూమెంట్ అయ్యింది.

నేను ఇప్పుడు మాట్లాడను అని, టైమ్ కావాలని చెప్పింది రతిక. అంతేకాదు, నువ్వు మాట్లాడమనగానే వెంటనే రిప్లై ఇవ్వాలా ? థ్యాంక్స్ ఫర్ యువర్ ఫ్రెండ్షిప్.. ఐయామ్ మ్యాడ్ ఓకేనా అంటూ రెచ్చిపోయింది. అసలు వీళ్లిద్దరి మద్యలో ఏం జరిగింది ? ఎందుకు రతిక ఓవర్ గా రియాక్ట్ అయ్యిందంటే., బిగ్ బాస్ హౌస్ లో సండే ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున పడవ గేమ్ ఆడించాడు. ఈ బోట్ లో ఇద్దరిని పెట్టి ఒకరిని ముంచేయాలి, ఒకరిని తీరం చేర్చాలంటే ఎవరిని చేస్తారంటూ ఫిట్టింగ్ పెట్టాడు. ఫస్ట్ గౌతమ్ అర్జున్ ని ముంచేస్తా , ప్రియాంకని బోట్ లో తీస్కుని వెళ్తా అన్నాడు.

ఆ తర్వాత యవర్ వచ్చినపుడు శివాజీని తీరానికి తీసుకుని వెళ్తాను అని, రతికని ముంచేస్తానని చెప్పాడు. అక్కడ్నుంచీ రతిక అసహనంతో ఉంది. అలాగే, రతిక టర్న్ వచ్చేసరికి శివాజీ ని కాపాడుకుంటానని, యావర్ ని ముంచేస్తానని చెప్పింది. ఇక్కడే నాగార్జున రతిక ఎక్కువగా ఆలోచిస్తుంటే అంతసేపు ఆలోచిస్తే నిన్ను అతిక అని పిలుస్తా అన్నాడు. దీంతో రతిక శివాజీని బోట్ లో ఉంచి, యావర్ ని ముంచేసింది. అంతేకాదు, ఇక్కడ రీజన్ చాలా ఫ్రెండ్ అనుకున్నాను అని, కానీ ఇందాక బోట్ లో నుంచీ తీసేశాడు ఆయన మైండ్ లో ఏదో ఉందని అనుకుంటున్నా అంటూ రీజన్ ఇచ్చింది.

అంతేకాదు , హౌస్ లో ఎవరు ఏంటి అనేది క్లారిటీ వచ్చింది. అసలు గేమ్ స్టార్ట్ చేస్తా, అంటూ రతిక స్ట్రాంగ్ గా చెప్పింది. ఇక్కడే హోస్ట్ నాగార్జున బ్రేక్ ఇచ్చాడు. దీంతో రతికకి – యావర్ కి చిన్న ఆర్గ్యూమెంట్ అయ్యింది. రతిక వెళ్లిపోతుంటే యావర్ పిలిచాడు. నేను తర్వాత మాట్లాడతాను, వేరే మైండ్ సెట్ లో ఉన్నానని స్ట్రాంగ్ గా చెప్పింది. నువ్వు పిలిచనప్పుడల్లా పలకాలా.. రిప్లై ఇవ్వాలా అంటూ ఆర్గ్యూమెంట్ పెట్టుకుంది. దీంతో వీరిద్దరి మద్యలో చిన్న గొడవ స్టార్ట్ అయ్యింది.

హోస్ట్ నాగార్జున ఆడించిన ఫన్ గేమ్ ఇద్దరి మద్యలో చిచ్చు పెట్టింది. అంతేకాదు, హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ అందరికీ హింట్స్ ఇస్తునే ఉన్నాడు. ఎవరు ఎవరికి ఫేవరెటిజం ఎవరు ఎవరికి కో-ఆపరేటివ్ గా గేమ్ ఆడుతున్నారనేది చెప్పాడు. అంతేకాదు, గ్రూపిజం అంటే ఎలా ఉంటుందో వీడియో కూడా చూపించాడు. దీంతో కొంతమందికి గేమ్ క్లియర్ గా అర్దమైంది. అలాగే, రతిక కూడా ఇకనుంచీ నా ఆట చూపిస్తా అంటూ ఛాలెంజ్ చేసింది. మరి సండే ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ మద్యలో చిచ్చు పెట్టేందుకే బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) ఈ మాస్టర్ ప్లాన్ వేశాడా అనిపిస్తోంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus