Bigg Boss 7 Telugu: ముగ్గురు భామలు రీ ఎంట్రీ..! ఉల్టా పుల్టా ట్విస్ట్ ఇదేనా..!

బిగ్ బాస్ హౌస్ లో శనివారం ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్ గా మారుతోంది. మూడోవారం, నాలుగోవారం, ఐదోవారం ఎలిమినేట్ అయిపోయిన థామిని, రతిక, ఇంకా శుభశ్రీ ఈ ముగ్గురూ కూడా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. హౌస్ లోకి వీళ్లని పంపిస్తూ బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. వరుసగా అమ్మాయిలు ఎలిమినేట్ అవుతున్నారని ఆడియన్స్ బాగా బాధపడుతున్నారని బిగ్ బాస్ ఈసారి ముగ్గురు భామలని హౌస్ లోకి పంపాడు. దీంతో ఇప్పుడు గేమ్ ఇంట్రస్టింగ్ గా మారబోతోంది.

అయితే, వీళ్లు హౌస్ లోకి కేవలం వచ్చి వెళ్లిపోతారా, లేదా కంటెస్టెంట్స్ గా ఉండుపోతారా అనేది ఆసక్తికరంగా మారింది. అసలు శనివారం ఎపిసోడ్ లో ఏం జరగబోతోందంటే., ప్రిన్స్ యావర్ కెప్టెన్సీలో అమర్ తో వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరి మద్యలో వాగ్వివాదం జరుగుతోంది. దీనికి మద్యలో సందీప్ వచ్చి అది కాదురా..

అని మాట్లాడుతుంటే ప్రిన్స్ యావార్ ట్రిగ్గర్ అయ్యాడు. రా.., అని అనొద్దని చెప్పాడు. దీంతో సందీప్ కి కోపం వచ్చింది. ఇద్దరి మద్యలో ఆర్గ్యూమెంట్స్ జరిగాయి. దీనిపైన నాగార్జున ప్రిన్స్ కి క్లాస్ పీకుతున్నాడు. దీంతో శనివారం ఎపిసోడ్ ఇంట్రస్టింగ్ గా మారింది. అంతేకాదు, ఇక్కడ మిగతా హౌస్ మేట్స్ కి కూడా గట్టిగానే క్లాస్ పడినట్లుగా తెలుస్తోంది.

ఇక హౌస్ లోకి (Bigg Boss 7 Telugu) ముగ్గురు భామలని రీ ఎంట్రీతో పంపించాడు హోస్ట్ నాగార్జున. ఉల్టా పుల్టా అని ఈ సీజన్ లో ఏదైనా జరగచ్చని చెప్పాడు. థామిని, శుభశ్రీ, రతిక ముగ్గురూ కూడా నవ్వుకుంటూ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు వాళ్లు తిరిగి హౌస్ మేట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా సీజన్ వేరే లెవల్లో ఉంటుందనే అంటున్నారు బిగ్ బాస్ ఆడియన్స్. అదీ మేటర్.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus