Bigg Boss 7 Telugu: రీ ఎంట్రీ తర్వాత రతిక కావాలనే ప్రశాంత్ ని మళ్లీ కదుపుతోందా ? ఏం జరుగుతోందంటే.,

బిగ్ బాస్ హౌస్ లో రతిక రీ ఎంట్రీ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఎత్తులకి పై ఎత్తులు నడుస్తున్నాయ్. ప్రస్తుతం ఆటలో మజా అనేది పోయింది. ఇప్పుడు ఎమోషన్స్ మాత్రమే మిగిలాయ్. వాటితోనే హౌస్ మేట్స్ ఆడుకోబోతున్నారు అనేది మాత్రం పక్కాగానే తెలుస్తోంది. ఎందుకంటే, రతిక – శివాజీ – ప్రశాంత్ – యావర్ వీళ్లు జోస్ అలూకాస్ రూమ్ లో కూర్చుని డీప్ గా డిస్కషన్స్ పెట్టారు. ఇది దాదాపుగా 45 నిమిషాలు నడిచింది. యావర్ ని ఇన్ఫులెన్స్ చేసి ప్రశాంత్ తో మాట్లాడేందుకు తోడు తీస్కుని వెళ్లింది రతిక.

నిజానికి తనకి ప్రశాంత్ తో మళ్లీ ఫ్రెండ్షింప్ బాండింగ్ కావాలని అనుకుంటే శివాజీని ఇన్వాల్ చేయచ్చు. కానీ, యావర్ ని తెచ్చుకుంది. ప్రశాంత్ తో ముందుగా నన్ను అక్కా అని పిలవడం మానేయ్ అని చెప్పింది. దానికి ప్రసాంత్ ససేమిరా పిలవను అన్నాడు. మరి మొదట్లో ఎందుకు అలా నాతో ప్రవర్తించావ్ అంటూ గతం అంతా గుర్తు చేసింది. నామినేషన్స్ లో శోభా దిండుపైన పిఆర్ అని ఎందుకు రాశావ్ అని అడిగితే ప్రశాంత్ ఆన్సర్ చేయలేదు. అక్కడ మేము ఫ్రెండ్స్ అని ఒక్క మాట చెప్తే సరిపోతుంది కదా.. నేను నీకు లవ్ చేస్తున్నానని చెప్పానా అన్నాడు ప్రశాంత్ అని గుర్తు చేసింది.

దీనికి ప్రశాంత్ నువ్వు కూడా చెప్పలేదు కదా అంటూ తిరిగి కౌంటర్ వేశాడు. ఇలా ఇద్దరి మద్యలో చాలా ఆర్గ్యూమెంట్స్ అయ్యాయి. ఇద్దరూ కూడా ఎమోషనల్ అయ్యారు. ఫైనల్ గా మా బాపుని ఇందులోకి లాగావ్ అని, మా ఇంట్లో వాళ్లని తిట్టావని రతికకి గుర్తుచేశాడు. ఎమోషనల్ కూడా అయ్యాడు. మద్యలో యావర్ ఇన్వాల్ అవుతూ అది అమర్ వల్ల అని చెప్పిందని, గేమ్ ని డిస్ట్రాక్ట్ చేయడానికి వాళ్లు అలా చేశారని అన్నాడు. దానికి సారీ చెప్పానని రతిక బుకాయించే ప్రయత్నం చేసింంది. అంతేకాదు, తిరిగి మళ్లీ ప్రశాంత్ తో ఇది వరకటిలాగా ఉందామని చెప్పింది.

కానీ, నేను మాత్రం నిన్ను అక్కా అనే పిలుస్తా అంటూ పల్లవి ప్రశాంత్ తెగేసి మరీ చెప్పాడు. వీళ్ల డిస్కషన్ డీప్ గా సాగుతుంటే మద్యలో శివాజీ వచ్చాడు. అక్కడ్నుంచీ స్టోరీ బోర్డ్ అంతా మారిపోయింది. నిజానికి ప్రశాంత్ రతికతో మాట్లాడటానికి అంతగా ఇష్టపడలేదు. ఇదే విషయం రతిక చెప్పింది. నేను రాగానే ఏదైనా మనం సాల్వ్ చేస్కోవాల్సింది ఉందా అని అడిగానని ఏం లేదని ప్రశాంత్ చెప్పాడని చెప్పింది. అలాగే, అంతకుముందు శివాజీతో రతిక మళ్లీ వచ్చింది కదా నాకు మాట్లాడాలని లేదు, అస్సలు కలవాలని లేదు అంటూ చెప్పాడు ప్రశాంత్.

ఇక శివాజీ ఫ్రెండ్ గానే ఉండమంటోంది కాబట్టి గుడ్ ఫ్రెండ్స్ గానే ఉండండి అంటూ కన్ క్లూజన్ ఇచ్చాడు. అంతేకాదు, ఇక్కడే శివాజీ ప్రశాంత్ ని ఒక రేంజ్ లో పొగిడాడు. నేను ఫస్ట్ లో ఏదో నటిస్తున్నాడనే అనుకున్నా కానీ తను చాలా మంంచోడు అని సర్టిఫికేట్ ఇచ్చాడు. అలాగే, ఫైనల్ వరకూ వెళ్తాడు. ఇంకా పైకి కూడా వెళ్తాడంటూ జోస్యం చెప్పాడు. ఇంట్లో అందరూ ఎగైనిస్ట్ అయినరోజున నేను వాడికి సపోర్ట్ చేశా. ఇప్పుడు కూడా చేస్తునే ఉంటా అంటూ చెప్పాడు.

రతికని కూడా గేమ్ (Bigg Boss 7 Telugu) గట్టిగా ఆడమని, నేను నిన్ను క్షమించాను అది నా మెచ్యూరిటీ అది అందరికీ ఉండాలని రూల్ లేదని చెప్పాడు. నేను ఎంతో మంది ఆర్టిస్ట్ లతో పని చేశాను వాళ్ల బాడీ లాంగ్వేజ్ ని బట్టీ తెలిసిపోతుంది. ఇన్ని రోజులు నటిస్తూ ఉండలేరు. వాడు మంచోడు గుడ్ పర్సన్ అంటూ చెప్పాడు శివాజీ. దీంతో అక్కడితో వాళ్లిద్దరి మద్యలో ఉన్న సమస్య తీరిపోయింది. మరి మున్ముందు వీరిద్దరి మద్యలో ఆట ఎలా ఉంటుందా అనేది ఆసక్తికరం.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus