Rathnavelu: నిజంగా నీకు హ్యాట్సాఫ్ తారక్.. సినిమాటోగ్రాఫర్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకరు కాగా తారక్ నటించిన దేవర (Devara)  సినిమా నుంచి తాజాగా దావూదీ సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ తెలుగు వెర్షన్ కు ఇప్పటివరకు 11 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. సాంగ్ బాగానే ఉంది కానీ దేవర గత సాంగ్స్ రేంజ్ లో అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ సాంగ్ బీస్ట్ (Beast) సినిమాలోని హలమతి హబిబో సాంగ్ ను గుర్తు చేసేలా ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Rathnavelu

మరి కొందరు మాత్రం ఈ సాంగ్ ఊసరవెల్లి (Oosaravelli) సినిమాలోని ఎలంగో ఏలంగో సాంగ్ ను గుర్తు చేసేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సాంగ్ లో తారక్ డ్యాన్స్ స్టెప్స్ మాత్రం అదిరిపోయాయి. కొన్నిరోజుల క్రితం తారక్ ఎడమ చేతికి గాయమైన సంగతి తెలిసిందే. అయితే ఆ గాయంతో బాధ పడుతూనే తారక్ ఈ సాంగ్ డ్యాన్స్ షూట్ లో పాల్గొన్నారు. గాయం బాధను అనుభవిస్తూనే తారక్ అద్భుతంగా డ్యాన్స్ చేశారు.

సినిమాటోగ్రాఫర్ రత్నవేలు (Rathnavelu) సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ట్వీట్ చేయగా ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. రత్నవేలు ట్వీట్ లో గాయం, కండరాల నొప్పి వల్ల బాధ పడుతున్నా జూనియర్ ఎన్టీఆర్ ఫాస్ట్ బీట్ సాంగ్ కు సులువుగా డ్యాన్స్ చేశాడంటే ఆశ్చర్యం కలుగుతోందని నిజంగా తారక్ కు హ్యాట్సాఫ్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ డెడికేషన్ కు తారక్ అభిమానులు ఫిదా అవుతున్నారు.

తారక్ గాయాలను సైతం లెక్క చేయకుండా కష్టపడతారు కాబట్టే వరుస విజయాలు దక్కడంతో పాటు తారక్ సక్సెస్ రేట్ పెరుగుతోందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ఇతర భాషల ప్రేక్షకులను సైతం మెప్పించాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సందీప్ రెడ్డి వంగాకి ఏమాత్రం తీసిపోని వివేక్ ఆత్రేయ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus