The Greatest of All Time First Review: ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Click Here For The Greatest of All Time Review

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన లేటెస్ట్ మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’. మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో స్నేహ, లైలా వంటి హీరోయిన్లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్, జయరామ్ సుబ్రహ్మణ్యం, ప్రభు దేవా వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించాడు.వెంకట్ ప్రభు దర్శకుడు.సెప్టెంబర్ 5న విడుదల అవుతుంది ఈ చిత్రం. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు వంటివి పెద్దగా ఇంప్రెస్ చేయలేదు.

The Greatest of All Time

దీంతో లో బజ్ తో రిలీజ్ అవుతుంది ఈ మూవీ. తమిళంలో తప్ప తెలుగులో ఈ సినిమాపై పెద్దగా హైప్ లేదు అని చెప్పాలి. ఇక ఆల్రెడీ కొంతమంది ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రాన్ని వీక్షించడం జరిగింది. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందిందట. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు బాగున్నాయట. సినిమాటోగ్రఫీ కూడా మెప్పించే విధంగా ఉంది అని తెలుస్తుంది.

ఇంటర్వెల్ సీక్వెన్స్ మెప్పించే విధంగా ఉందట. పాటలు పెద్దగా మైండ్లో రిజిస్టర్ అయ్యే విధంగా ఉండవని అంటున్నారు. యాక్షన్ సీక్వెన్స్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుందట. సెకండాఫ్ విషయానికి వస్తే.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొత్తగా లేకపోయినా పాసబుల్ గా అనిపిస్తుందట. క్లైమాక్స్ కూడా ఓకే అని అంటున్నారు. మొత్తంగా ఒకసారి చూసే విధంగా అయితే ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ సినిమా ఉంటుందని అంటున్నారు.

కానీ వెంకట్ ప్రభు మ్యాజికల్ స్క్రీన్ ప్లే అయితే మిస్ అయినట్టు చెబుతున్నారు. మార్నింగ్ షోలు ముగిసాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి..

35.. చిన్న క‌థ కాదు’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus