Saripodhaa Sanivaaram: సందీప్ రెడ్డి వంగాకి ఏమాత్రం తీసిపోని వివేక్ ఆత్రేయ..!

  • September 5, 2024 / 05:44 PM IST

ఎంత టాలెంట్ ఉన్న దర్శకుడికి అయినా ఏదో ఒక బలహీనత ఉంటుంది అని ఇండస్ట్రీ పెద్దలు చెబుతుంటారు. అందుకు ఉదాహరణలు కూడా వాళ్ళు చాలానే చెబుతుంటారు. రాజమౌళి (S. S. Rajamouli).. ఓ సినిమాని ఏళ్లకు ఏళ్ళు టైం తీసుకుని చేస్తుంటాడు. శంకర్ (Shankar) అయితే గ్రాండియర్ అంటూ నిర్మాతతో ఎక్కువ బడ్జెట్ పెట్టించేస్తూ ఉంటాడు. తర్వాత ఎడిటింగ్ టేబుల్ వద్ద చాలా ఫుటేజ్ ను డిలీట్ చేయించేస్తూ ఉంటాడు. సుకుమార్ (Sukumar) అయితే సినిమా రిలీజ్ రేపు ఉంది అని తెలిసినా ఇంకా షూటింగ్ చేస్తూనే ఉంటాడు. అది కూడా చాలా స్లోగా.!

Saripodhaa Sanivaaram

త్రివిక్రమ్ (Trivikram) అయితే సినిమా సగం తీసేసినా మళ్ళీ స్క్రిప్ట్ లో మార్పులు చేసి కొత్తగా షూట్లోకి దిగుతాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. సరిగ్గా వీళ్ళలానే దర్శకుడు వివేక్ ఆత్రేయకి (Vivek Athreya) కూడా ఒక బలహీనత ఉంది. అతని లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram)  సినిమా విషయంలో ఇది మరోసారి బయటపడింది. విషయం ఏంటంటే ‘సరిపోదా శనివారం’ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా.. రన్ టైం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సెకండాఫ్ లో ట్రిమ్ చేసే అవకాశం ఉన్నా వివేక్ అందుకు ఏకీభవించలేదు.

కారణం ఈ సినిమాకి (Saripodhaa Sanivaaram) దర్శకుడు అతనే, రైటర్ కూడా అతనే. అక్కడే వచ్చింది సమస్య అంతా..! రైటర్ దర్శకుడు అయితే తాను రాసుకున్న ప్రతి సీన్ సినిమాలో ఉండాలని కోరుకుంటాడు. ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki)  పెద్ద లెవెల్లో డ్యామేజ్ జరగడానికి కారణం అదే. వాస్తవానికి ‘సరిపోదా శనివారం’ సినిమా రన్ టైం 3 గంటల 45 నిమిషాలు వచ్చిందట. ఈ విషయాన్ని ఆ సినిమా సంగీత దర్శకుడు జేక్స్ బిజాయ్ (Jakes Bejoy) చెప్పుకొచ్చాడు. అతను మాట్లాడుతూ.. ” ‘సరిపోదా శనివారం’ రన్ టైం మొదట 3 గంటల 45 నిమిషాలు వచ్చింది. తర్వాత 2 గంటల 50 నిమిషాలకి కుదించారు.

సో చాలా వరకు ట్రిమ్ చేసినట్టే..! ఆగస్టు 2 వ తేదీ వరకు దర్శకుడు వివేక్ షూటింగ్ చేస్తూనే ఉన్నారు. అయితే జూలై నుండి రీ రికార్డింగ్ స్టార్ట్ చేశాను. అందువల్లే టైంకి సినిమా రెడీ అయ్యింది. కానీ లిరిక్స్ విషయంలో నాకు అవగాహన లేదు. అందువల్ల అది వివేక్ కే వదిలేశాను. నేను తెలుగులో ‘టాక్సీ వాలా’ (Taxiwaala) ‘చావు కబురు చల్లగా’ (Chaavu Kaburu Challaga) ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial) వంటి సినిమాలు చేసినా రాని గుర్తింపు ‘సరిపోదా శనివారం’కి వచ్చింది. ‘కింగ్ ఆఫ్ కోత’ తర్వాత ఇది నా బెస్ట్ వర్క్ అని అంతా ప్రశంసించారు.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్లే తెలుగు ప్రేక్షకులు నన్ను ఇంత ఓన్ చేసుకుంటారు అని నేను అనుకోలేదు. అది నాకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పుడైతే తెలుగులో నాకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ దేనికి కూడా ఓకే చెప్పలేదు. విశ్వక్ సేన్ (Vishwak Sen) ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) సినిమా నేను ‘సరిపోదా’ కంటే ముందు సైన్ చేసిన ప్రాజెక్టు” అంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు జేక్స్. అతని మాటల్ని బట్టి దర్శకుడు వివేక్ ఆత్రేయ… ‘యానిమల్’ (Animal) సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఏమాత్రం తీసిపోడు అని స్పష్టమవుతుంది.

 కంగనా రనౌత్ కు వరుస షాకులు.. ఇప్పట్లో రిలీజ్ కష్టమేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus