Tollywood: గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ స్టార్స్.. చిరు టు విశ్వక్ సేన్ ఎంతెంత ఇచ్చారంటే?

తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. గత వారం రోజులుగా గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు నలిగిపోతున్నారు. ఇప్పటికే లక్షల ఎకరాల్లోని పంట దెబ్బ తినడంతో రైతులు లభో దిభో అంటున్నారు. ఇక లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయం కావడంతో.. ఇళ్లల్లోకి వర్షపు నీరు, డ్రైనేజీ నీరుతో కలిసి రావడం..వల్ల చాలా మంది జనాలు జ్వరాల భారిన పడుతున్నారు.

Tollywood

అలాగే ఇంట్లో సామాన్లు సైతం నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడం వల్ల ఇంకొంతమంది చాలా ఇబ్బందులకు పడుతున్నారు. మరోపక్క వరదల కారణంగా తెలంగాణలో 17 మంది మృతి చెందారు. ఆంధ్రాలో చాలా మంది మృత్యువాత పడ్డారు. ఇక అనేక ప్రాంతాల్లోని జనాలు తినడానికి తిండి లేక, తాగడానికి సరైన నీరు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోతెలుగు రాష్టాల ప్రజలను ఆదుకునేందుకు.. కుదేలైపోయిన ప్రాంతాలను బాగు చేసేందుకు.. సినీ పరిశ్రమకు (Tollywood) చెందిన హీరోలు తమ వంతు విరాళాలు ప్రకటిస్తున్నారు. మరి ఏ ఏ సెలబ్రిటీ ఎంతెంత విరాళం ప్రకటించారో ఓ లుక్కేద్దాం రండి :

1) పవన్ కళ్యాణ్ :

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి ప్రకటించారు. అలాగే పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరదల వల్ల ఇబ్బంది పడ్డ 400 పంచాయతీలకు.. ఒక్కో పంచాయతీకి గాను రూ.1 లక్ష చొప్పున… మొత్తంగా రూ.4 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ రూ.6 కోట్లు విరాళం ప్రకటించడం జరిగింది.

2) ప్రభాస్ :

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తెలంగాణ రాష్ట్రానికి ఓ కోటి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకో కోటి.. మొత్తంగా రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు.

3) చిరంజీవి :

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  తెలంగాణ రాష్ట్రానికి రూ.50 లక్షలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకో రూ.50 లక్షలు.. మొత్తంగా రూ.1 కోటి విరాళం ప్రకటించడం జరిగింది.

4) మహేష్ బాబు :

టాలీవుడ్ (Tollywood) సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)  కూడా తెలంగాణ రాష్ట్రానికి రూ.50 లక్షలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకో రూ.50 లక్షలు.. మొత్తంగా రూ.1 కోటి విరాళం ప్రకటించడం జరిగింది.

5) రాంచరణ్ :

మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) సైతం తెలంగాణ రాష్ట్రానికి రూ.50 లక్షలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకో రూ.50 లక్షలు.. మొత్తంగా రూ.1 కోటి విరాళం ప్రకటించడం జరిగింది.

6) అల్లు అర్జున్ :

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సైతం తెలంగాణ రాష్ట్రానికి రూ.50 లక్షలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకో రూ.50 లక్షలు.. మొత్తంగా రూ.1 కోటి విరాళం ప్రకటించడం జరిగింది.

7) ఎన్టీఆర్ :

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) సైతం తెలంగాణ రాష్ట్రానికి రూ.50 లక్షలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకో రూ.50 లక్షలు.. మొత్తంగా రూ.1 కోటి విరాళం ప్రకటించడం జరిగింది.

8) అక్కినేని ఫ్యామిలీ :

అక్కినేని హీరోలు నాగార్జున (Nagarjuna) , నాగ చైతన్య (Naga Chaithanya) , అఖిల్ (Akhil) .. లు అంతా కలిసి తెలంగాణ రాష్ట్రానికి రూ.50 లక్షలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకో రూ.50 లక్షలు.. మొత్తంగా రూ.1 కోటి విరాళం ప్రకటించడం జరిగింది.

9) నందమూరి బాలకృష్ణ :

నటసింహం బాలయ్య  (Balakrishna) సైతం తెలంగాణ రాష్ట్రానికి రూ.50 లక్షలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకో రూ.50 లక్షలు.. మొత్తంగా రూ.1 కోటి విరాళం ప్రకటించడం జరిగింది.

10) త్రివిక్రమ్ & చినబాబు :

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్  (Trivikram) , నిర్మాత చినబాబు (Radha Krishna) కలిసి తెలంగాణ రాష్ట్రానికి రూ.25 లక్షలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకో రూ.25 లక్షలు.. మొత్తంగా రూ.50 లక్షలు కోటి విరాళం ప్రకటించడం జరిగింది.

11) వైజయంతి మూవీస్ :

టాలీవుడ్ (Tollywood) అగ్ర నిర్మాణ సంస్థ ‘వైజయంతి మూవీస్’ వారు కూడా తెలంగాణ రాష్ట్రానికి ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిపి రూ.45 లక్షలు.. విరాళంగా ప్రకటించడం జరిగింది.

12) విశ్వక్ సేన్ :

మాస్ క దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) సైతం తెలంగాణ రాష్ట్రానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిపి రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించడం జరిగింది.

13) వెంకీ అట్లూరి :

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) సైతం తెలంగాణ రాష్ట్రానికి , అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిపి రూ.10 లక్షలు.. విరాళంగా ప్రకటించడం జరిగింది.

14) అనన్య నాగళ్ళ :

టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ (Ananya Nagalla) కూడా తెలంగాణ రాష్ట్రానికి , అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిపి రూ.5 లక్షలు.. విరాళంగా ప్రకటించడం జరిగింది.

15) సిద్దు జొన్నలగడ్డ :

టాలీవుడ్ స్టార్ హీరో సిద్ధు జొన్నలగడ్డ  (Siddhu Jonnalagadda) తెలంగాణ రాష్ట్రానికి , అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిపి రూ.30 లక్షలు.. విరాళంగా ప్రకటించడం జరిగింది.

16) సోనూ సూద్ :

పాన్ ఇండియా నటుడు సోనూసూద్ (Sonu Sood) తెలంగాణ రాష్ట్రానికి ఒక రూ.1 కోటి , అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకో రూ.1 కోటి కలుపుకుని రూ.2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

సందీప్ కిషన్ (Sundeep Kishan) వంటి యంగ్ హీరోలు కూడా తమ వంతు సహాయక చర్యలు చేపట్టినట్టు సమాచారం.

తన 27 ఏళ్ళ కెరీర్లో పవన్ మిస్ చేసుకున్న రీమేక్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus