35 Chinna Katha Kaadu First Review: ’35.. చిన్న క‌థ కాదు’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • September 5, 2024 / 02:10 PM IST

Click Here For 35 Chinna Katha Kaadu Review

నివేదా థామ‌స్‌ (Nivetha Thomas), వాసుదేవ్ రచ్చకొండ (Vishwadev Rachakonda) ప్రధాన పాత్రల్లో ప్రియ‌ద‌ర్శి (Priyadarshi), భాగ్య‌రాజా, గౌత‌మి (Gauthami) వంటి వారు కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ’35 ..చిన్న కథ కాదు’ (35-Chinna Katha Kaadu). ఈ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చాయి. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఇప్పటివరకు ఫ్యాక్షన్ సినిమాలే ఎక్కువగా వచ్చాయి. కానీ అదే బ్యాక్ డ్రాప్లో ఓ క్లాస్ సినిమా ఇప్పటివరకు రాలేదు. ఈ సినిమాలో మంచి పాయింట్ ని టచ్ చేసినట్టు ప్రమోషనల్ కంటెంట్ చెబుతుంది. నంద కిషోర్ ఏమని (Nanda Kishore Emani) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

35 Chinna Katha Kaadu First Review

సృజన్ యరబోలు (Srujan Yarabolu), సిద్దార్థ్ రాళ్ళపల్లి (Siddharth Rallapalli ) ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. దగ్గుబాటి రానా (Rana Daggubati) ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. వాస్తవానికి ఆగస్టు 15 నే ఈ చిత్రాన్ని విడుదల చేయాలి అనుకున్నారు.. కానీ కొన్ని కారణాల వల్ల సెప్టెంబర్ 6 కి పోస్ట్ పోన్ చేశారు. అంటే మరో 2 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న మాట. ఇక విడుదలకు వారం రోజుల ముందు నుండి రానా..

ఈ చిత్రాన్ని కొంతమంది సినీ ప్రముఖులకు చూపించడం జరిగింది. వారి టాక్ ప్రకారం.. ఇది క్లాస్ సినిమా మాత్రమే కాదని.. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని అంటున్నారు. లెక్కల్లో ఎప్పుడూ ఫెయిల్ అయ్యే ఓ పిల్లాడి తల్లిదండ్రులు పడే ఆవేదనని.. ఆ తర్వాత చోటు చేసుకునే పరిస్థితులని ఈ సినిమాలో చాలా నేచురల్ గా చూపించారట. స్క్రీన్ ప్లే చాలా సెన్సిబుల్ గా, యూనిక్..గా ఉంటుంది అంటున్నారు.

ఈ సినిమా చూస్తున్న ఆ 2 గంటల 25 నిమిషాలు.. ప్రతి ఒక్కరూ కూడా తమ స్కూల్ డేస్..ని, ముఖ్యంగా మ్యాథ్స్ క్లాస్..లను, అందులో వచ్చిన మార్కులను నెమరు వేసుకోవడం గ్యారెంటీ అని అంటున్నారు. మరి సెప్టెంబర్ 6న ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

రజనీకాంత్‌ కామెంట్స్‌పై రియాక్ట్‌ అయిన రాధిక.. ఏమన్నారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus