Ravanasura: ‘రావణాసుర’ మూవీకి సెన్సార్ కట్ చెప్పిన సన్నివేశాలు ఇవే!

  • March 31, 2023 / 08:01 PM IST

మాస్ మహారాజా’ రవితేజ వరుసగా సినిమాలు లైనప్ చేస్తూ జెటో స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ మూవీస్‌తో సందడి చేశాడు.. ‘ధమాకా’ తో కెరీర్‌లో ఫస్ట్ టైం రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టాడు.. ప్రస్తుతం ‘రావణాసుర’ రిలీజ్‌కి రెడీ అవుతుండగా.. ‘టైగర్ నాగేశ్వర రావు’ (బయోపిక్) దసరాకి రానుంది.. సుధీర్ వర్మ దర్శకత్వంలో, అభిషేక్ ఆర్ట్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ల మీద రవితేజ – అభిషేక్ నామా నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రావణాసుర’..

ఫస్ట్ టైం ఐదుగురు హీరోయిన్లతో నటిస్తున్నాడు మాస్ మహారాజా.. అను ఇమ్మానుయేల్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, మేఘా ఆకాశ్, దక్షా నగార్కర్ ఫీమేల్ లీడ్స్.. యంగ్ హీరో సుశాంత్ నెగిటివ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు.. శ్రీరామ్, రావు రమేష్, జయరాం (మలయాళం), మురళీ శర్మ, హైపర్ ఆది, హర్ష వర్థన్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.. రవితేజ పవర్ ఫుల్ లాయర్‌గా సేమ్ టైమ్ ప్రతినాయక ఛాయలున్న వ్యక్తిలా రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తున్నాడు..

తన స్టైల్ కామెడీతో పాటు యాక్షన్‌తోనూ అలరించబోతున్నాడని ట్రైలర్ హింట్ ఇచ్చింది.. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 7న థియేటర్లలోకి రానుంది.. రీసెంట్‌గా ‘రావణాసుర’ సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సినిమా రన్ టైమ్ 141 నిమిషాలు.. (2 గంటల 21 నిమిషాలు).. A సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ వారు చిన్న చిన్న మార్పులు చెప్పారు.. లిక్కర్ బ్రాండ్స్ తొలగించాలని..

అలాగే రెండు చోట్ల ‘రేప్’ అనే పదాన్ని, ‘కంచం ముందుకి, మంచం మీదకి ఆడపిల్ల’ అనే డైలాగ్, ‘ఇండియా మేడ్ కాఫ్ సిరప్’ అనే దానిలో ‘ఇండియా’ అనే పదం తీసెయ్యాలని, స్మోకింగ్ సీన్స్ వచ్చినప్పుడు ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరికను జత చేయాలని సూచించారు.. ఇలా మొత్తంగా 5 కట్స్ చెప్పారు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus